Manish Tewari: చండీగఢ్ అభ్యర్థి మనీష్ తివారీకి నోటీసులు

చండీగఢ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మనీష్ తివారీకి ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లఘించారని ఫిర్యాదులు రాగా.. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు.

New Update
Manish Tewari: చండీగఢ్ అభ్యర్థి మనీష్ తివారీకి నోటీసులు

Manish Tewari: దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎన్నికల కోడ్ ఉల్లఘించారని కాంగ్రెస్ పార్టీ చండీగఢ్ అభ్యర్థి మనీష్ తివారీ, పార్టీ రాష్ట్ర విభాగం చీఫ్ హెచ్‌ఎస్ లక్కీకి చండీగఢ్ జిల్లా ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల తయారీ, పంపిణీలో వివిధ ప్రాంతాల్లో నిమగ్నమై ఉన్నారని పలు ఫిర్యాదుల ఆధారంగా DEO-కమ్-రిటర్నింగ్ అధికారి తివారీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి నోటీసు జారీ చేశారు.

ALSO READ: మనీష్ సిసోడియాకు షాక్.. మరోసారి కస్టడీ పొడింపు

మలోయా, దరియా, కిషన్‌గఢ్, మణిమజ్రా, బాపు ధామ్ కాలనీ, ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్ ధనస్ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను కాంగ్రెస్ కార్యకర్తలు పంచుతున్నారని.. అలాగే అక్కడి ప్రజలను కాంగ్రెస్ హామీలను చూపి వల్ల సమాచారాన్ని తీసుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని వారిని ప్రలోభ పెడుతున్నట్లు ఈసీకి ఫిర్యాదులు రాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు.

సహాయక రిటర్నింగ్‌ అధికారులు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల నుంచి సేకరించిన ఫీల్డ్‌ రిపోర్టు ప్రకారం, కొంతమంది నివాసితులు తమ పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ వంటి వివరాలను కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు నింపి పంపినట్లు తెలిసిందని ఎన్నికల అధికారి తెలిపారు. అందుకున్న ఫిర్యాదులు, నివేదికలను పరిశీలించిన తరువాత, ఈ చట్టవిరుద్ధమైన ఎన్నికల కార్యకలాపాలు ఎవరి ఆదేశానుసారం జరుగుతున్నాయో, అభ్యర్థి, రాజకీయ పార్టీపై ECI సూచనలను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా కేసు నమోదు చేయబడిందని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు