Hail : గురువారం పార్వతీపురం, మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు(Weather Officials) తెలిపారు. సుమారు 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. శనివారం 5 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 253 వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
శ్రీకాకుళం 4 , విజయనగరం 19, పార్వతీపురంమన్యం 12, అల్లూరిసీతారామరాజు 4, అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్సార్ 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
బుధవారం వైయస్సార్(YSR) కడప జిల్లా(Kadapa District) ఒంటిమిట్టలో43.4°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3°C, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు వివరించారు.
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
డీ హైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
Also read: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ యంగ్ హీరో!