BRS Cabinet: కేసీఆర్ నయా గేమ్ ప్లాన్.. కేబినెట్ విస్తరణకు సిద్ధం! సీఎం కేసీఆర్ ఎక్కడా తగ్గడంలేదు. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ విస్తరణకు సిద్ధమయ్యారు సీఎం. పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గవర్నర్ రాగానే కేబినెట్ విస్తరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. By Trinath 21 Aug 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి సీఎం కేసీఆర్ ఎక్కడా తగ్గడంలేదు. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ విస్తరణకు సిద్ధమయ్యారు సీఎం. పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గవర్నర్ రాగానే కేబినెట్ విస్తరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈటల రాజీనామాతో కేబినెట్‌లో ఒక బెర్త్ ఖాళీ ఉంది.. ఇక అన్ని అనుకున్నట్టే జరిగితే ఎల్లుండి(ఆగస్టు 23) ప్రమాణం స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. ఇక కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌కు కేబినెట్‌లో మంత్రిగా అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా సాగుతోంది. వాటే ప్లాన్: మరోవైపు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ స్కెచ్‌లు వేస్తున్నారు. ఈక్రమంలోనే ఆనవాయితీగా శ్రావణమాసం తొలి సోమవారం రోజు ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించారు. ఇందులో పలువురు సీనియర్ నేతలకు మొండి చేయి చూపారు. పక్కాగా సీటు వస్తుందని ఆశించి కొందరు నేతలు భంగపడ్డారు. ఇందులో తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జలగం వెంకట్రావుతోపాటు పలువురు నేతలు ఉన్నారు. బీఆర్ఎస్‌లో తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్‌రెడ్డి ఓ వెలుగు వెలిగారు. కేసీఆర్ తొలి కేబినెట్‌లో మంత్రులుగా పనిచేశారు. కీలక శాఖలను చూశారు. 2014లో రోడ్లు, భవనాల శాఖను తుమ్మల చూస్తే..పట్నం మహేందర్‌రెడ్డి రవాణా శాఖను చూశారు. 2014 ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల, తాండూర్ నుంచి పట్నం గెలిచారు. ఐతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. దీంతో పట్నం సోదరులకు చెక్ పడినట్లు అయ్యింది. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రోహిత్‌కే సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. తుమ్మల విషయంలోనూ ఇదే జరిగింది. 2018 ఎన్నికల్లో పాలేరులో హస్తం అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్‌లోకి వచ్చారు. తాజాగా మరోసారి ఉపేందర్‌రెడ్డికే అవకాశం వరించింది. ఇటు మహేశ్వరం అసెంబ్లీ స్థానంలోనూ ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. కాంగ్రెస్ తరపున గెలిచిన సబితా ఇంద్రారెడ్డి..గులాబీ గూటికి చేరి మంత్రి అయ్యారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున సబితా బరిలో నిలవనున్నారు. మరో సీనియర్ నేత జలగం వెంకట్రావుకు సైతం చుక్కెదురు అయ్యింది. కొత్తగూడెంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు..ఆ తర్వాత కారెక్కారు. ఈసారి కూడా ఆయననే అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఉప్పల్ నుంచి పోటీ చేయాలని భావించిన బొంతూ రామ్మోహన్‌కు సైతం భం #cm-kcr #telangana-cabinet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి