Jharkhand:జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెర..విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్

జార్ఖండ్‌లో రాజకీయం కుదుట పడింది. కొన్ని రోజులుగా ఇక్కడ సంక్షోభంలో ఉన్న ఏఎంఎం ప్రభుత్వం ఈరోజు జరిగిన బలపరీక్షలో అవిశ్వీస తీర్మానం నెగ్గింది. చంపయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడగా...వ్యతిరేకంగా 29 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

New Update
Jharkhand:జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెర..విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్

Test Of Strength In Jharkhand Assembly:జార్ఖండ్‌లో మొత్తానికి చంపయ్ సోరెన్ ప్రభుత్వం విజయం సాధించింది. దీంతో గత కొన్ని రోజులుగా అక్కడ నెలకొన్న రాకీయ సంక్షోభానికి తెర పడినట్లు అయింది. జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస పరీక్షలో చంపయ్ సోరెన్ పార్టీ 47 ఓట్లు సంపాదించి ప్రబుత్వాన్ని నిలబెట్టుకుంది. వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. అంతకు ముందు హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత ఏఎంఎం పార్టీకి చెందిన చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అప్పుడే ఈయన ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో స్పీకర్ ఓటింగ్‌కు పిలిచారు. దీనికి అరెస్ట్ అయిన మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా వచ్చారు. జైలు నుంచి అసెంబ్లీకి వచ్చి మరీ అనుకూలంగా ఓటేశారు.

Also Read:Supreme Court: సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే కవిత పిటిషన్ విచారణ..16కు వాయిదా

అసెంబ్లీలో హేమంత్ సోరెన్ ప్రసంగం..

ఝార్ఖండ్‌లో భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో అరెస్టయిన మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ బలపరీక్షకు ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించారు. గత నెల జనవరి 31న ఈడీ అధికారులు తనను అరెస్టు చేశారని.. ఇది చీకటి అధ్యాయమని అన్నారు. పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి అరెస్టు రావడం దేశంలో ఇదే మొదటిసారని తెలిపారు. నా అరెస్టు వెనుక రాజ్‌భవన్‌ ప్రమేయం ఉందని తాను గట్టిగా నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు. 

నిన్నటి వరకూ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే..

బల పరీక్ష నేపథ్యంలో ఝార్ఖండ్ రాజకీయం హైదరాబాద్‌కు షిప్ట్‌ అయింది. రాంచి బిర్సా ముండా విమానశ్రయం నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో కాంగ్రెస్, జేఎంఎం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వాళ్లని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి లియోనియా రిసార్ట్స్‌కు తరలించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఇక ఝూర్ఖండ్‌లో బలపరీక్ష తేదీ ఖరారయ్యే దాకా హైదరాబాద్‌ క్యాంపులోనే ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఉండనున్నారు. ఇక ఆపరేషన్ ఝార్ఖండ్‌ బాధ్యతలను ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌ కుమార్‌.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు