Vote: మీ ఓటును వేరేవాళ్లు వేశారా..అయినా మీరు కూడా వేయోచ్చు తెలుసా..? ఎలాగంటే!

ఎన్నికల సమయంలో మీ ఓటును మరొకరు వేసినప్పటికీ మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు తెలుసా..దానికోసం సెక్షన్‌ 49 (పి) ఎలక్షన్‌ కమిషన్‌ దీనిని 1961లోనే అమల్లోకి తీసుకుని వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ స్టోరీ లో...చదివేయండి!

New Update
Telangana : ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌!

ఎన్నికలు అంటే బోలెడు తతంగం ఉంటుంది. ఎలక్షన్స్‌ అప్పుడు కొందరు ఓటర్ల పేర్లు ఓటర్ల లిస్ట్‌ నుంచి మిస్‌ అవ్వడం, మరికొందరి ఓట్లు ఇంకెవరో వేసేయడం గురించి వింటూనే ఉంటాం. లిస్ట్‌ లో పేరు లేకపోతే వేరే విషయం..కానీ మన ఓటును వేరేవరో వేశారు అంటేనే మనకి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి. కానీ మీ ఓటును వేరేవరో వేసినా కూడా మీరు నిరాశ పడాల్సిన అవసరం లేదు.

మీ ఓటును మరోకరు వేసినప్పటికీ మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు తెలుసా..దానికోసం సెక్షన్‌ 49 (పి) ఎలక్షన్‌ కమిషన్‌ దీనిని 1961లోనే అమల్లోకి తీసుకుని వచ్చింది. దీని గురించి తమిళ హీరో విజయ్ ఓ సినిమా కూడా తీశాడు. అందులో కథానాయకుడు ఈ సెక్షన్ ద్వారా తన ఓటు హక్కును దక్కించుకుంటాడు.

పోలింగ్‌ రోజు మీ ఓటును వేరే వారు వేశారని తెలిస్తే.. సెక్షన్‌ 49(పి) ఉపయోగించుకుని మీరు ఓటు హక్కు పొందొచ్చు. దీనికోసం ముందుగా ప్రిసైడింగ్‌ అధికారిని కలవాలి. ఓటు కోల్పోయిన వ్యక్తి తానే అని ఆ అధికారి ముందు రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులను వారికి సమర్పించాలి. ఎన్నారైలు అయితే పాస్‌పోర్టు కూడా చూపించొచ్చు. ఆ పై ప్రిసైడింగ్‌ అధికారి ఇచ్చే ఫామ్‌ 17(బి)లో పేరు, సంతకం చేసి ఇవ్వాలి.

అనంతరం టెండర్‌ బ్యాలెట్‌ పేపర్‌ను ప్రిసైడింగ్‌ అధికారి ఓటు కోల్పోయిన సదరు వ్యక్తికి అందజేస్తారు. బ్యాలెట్‌ పేపర్‌పై నచ్చిన అభ్యర్థికి ఓటేసి.. మరలా ప్రిసైడింగ్‌ అధికారికి ఇవ్వాలి. ఆయన ఆ బ్యాలెట్‌ పేపర్‌ను ప్రత్యేక కవర్‌లో ఉంచి.. కౌంటింగ్‌ కేంద్రానికి పంపిస్తారు. ఇలా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అవుతుంది. అయితే సెక్షన్‌ 49(పి) ద్వారా పొందే ఓటు హక్కును ఈవీఎం ద్వారా వేసేందుకు మాత్రం ఎలక్షన్ అధికారులు అనుమతివ్వరు.

49(పి) సెక్షన్ ద్వారా పొందే ఓటు హక్కును టెండర్‌ ఓటు, ఛాలెంజ్‌ ఓటు అని అంటారు. నిజానికి ఎన్నికల్లో 49(పి)ని వినియోగించుకున్న వారు చాలా తక్కువ మందే. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో 49(పి) గురించి ఎక్కువగా తెలియకపోవడమే ఇందుకు కారణం. అందుకే ఎలక్షన్ అధికారులే చొరవ తీసుకుని అందరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

Also read: ఎన్నికల వేళ వాతావరణశాఖ కీలక ప్రకటన!

Advertisment
తాజా కథనాలు