Saidabad: హైదరాబాద్ నడి బొడ్డున చైన్ స్నానింగ్.. దొంగలకు షాక్ ఇచ్చిన వృద్ధుడు! హైదరాబాద్ నడి బొడ్డున్న బంగారం దొంగలు రెచ్చిపోయారు. పనిలో భాగంగా సైదబాద్ వెళ్లిన వెల్డింగ్ వ్యాపారి ప్రకాశ్ మెడలో 2 తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోతుండగా ఇద్దరు యువకులు వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. By srinivas 29 Mar 2024 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి Chain Snatching in Hyderabad: చైన్ స్నాచింగ్ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. హైదరాబాద్ నడిబొడ్డున బంగారం దొంగతనానికి పాల్పడ్డారు. ఓ వృద్ధుడి మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయే ప్రయత్నంలో స్థానికులు ఊహించని షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వెల్డింగ్ వ్యాపారి మెడలో 2 తులాలు.. ఈ మేరకు మాదన్నపేటకు చెందిన ప్రకాష్(61) అనే వ్యక్తి వెల్డింగ్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే శుక్రవారం సాయంత్రం సైదాబాద్ శంఖేశ్వర్ బజార్ పెట్రోల్ బంక్ వద్ద కారులోంచి దిగుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి ప్రకాష్ చుట్టూ తిరుగుతూ భయబ్రాంతులకు గురి చేసి మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. ఇది కూడా చదవండి: National: 225 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు.. నివేదిక విడుదల చేసిన ఏడీఆర్! వెంబడించి పట్టుకున్న యువకులు.. దీంతో ఆ వృద్ధుడు వారిని పట్టుకునే క్రమంలో కింద పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అది గమనించిన ఇద్దరు యువకులు ఆ దొంగలను వెంబడించి ఒక దొంగను పట్టుకున్నారు. మరో దొంగ ఆటోలో పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా నిందుతులనుంచి సోమ్ము రికవరి చేస్తామన్నారు. #chain-snatchers #saidabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి