ఆ స్థానాల్లో రీపోలింగ్.. వికాస్ రాజ్ క్లారిటీ!

తెలంగాణలో రీపోలింగ్ జరుగుతుందనే దానిపై ఎన్నికల అధికారి వికాస్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 70.74 శాతం నమోదు ఆయినట్లు సీఈఓ వికాస్ రాజ్ తేలిపారు.

New Update
ఆ స్థానాల్లో రీపోలింగ్.. వికాస్ రాజ్ క్లారిటీ!

Telangana Polling: తెలంగాణలోని హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో చంద్రయాణగుట్ట, చార్మినర్, బహదూర్‌పుర స్థానాల్లో రీపోలింగ్ జరుగుతుందనే దానిపై ఎన్నికల అధికారి వికాస్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని స్పష్టం చేశారు. పోలింగ్ శాతం కొంచెం పెరగొచ్చు అని పేర్కొన్నారు. రాత్రి 10 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగినట్లు వెల్లడించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి కచ్చితమైన పోలింగ్ వివరాలు అందడం వల్లే పూర్తి స్థాయి పోలింగ్ శాతం రాలేదని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 70.74 శాతం నమోదు ఆయినట్లు సీఈఓ వికాస్ రాజ్ తేలిపారు.

ALSO READ: BREAKING: కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ

2018లో ఎన్నికలతో పోలిస్తే తగ్గిన పోలింగ్‌ శాతం తగ్గిందని అన్నారు. 2018లో నమోదైన పోలింగ్‌ శాతం 73.37 నమోదు అయినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఎల్లుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది అని అన్నారు. 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ జరిగిందని అన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలవుతుందని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు. ఓట్‌ ఫ్రం హోమ్‌ మంచి ఫలితాలు ఇచ్చిందని అన్నారు.

ఎన్నికల కోసం 2 లక్షల కంటే ఎక్కువ మంది సిబ్బంది కష్టపడ్డారని తెలిపారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం పోలింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు. అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలో 46.56 శాతం పోలింగ్ నమోదు అయినట్లు వెల్లడించారు.

ALSO READ: ఏపీ పోలీసులకు షాక్.. తెలంగాణ పోలీసుల కేసు.!

Advertisment
Advertisment
తాజా కథనాలు