Mukesh Kumar: డీఎస్సీ వాయిదాపై ఏపీ CEO కీలక వ్యాఖ్యలు..!

డీఎస్సీ పై విద్యాశాఖ వివరణ కొరామన్నారు ఏపీ CEO ముఖేష్ కుమార్ మీనా. విద్యా శాఖ నుంచి వివరణ రాగానే డీఎస్సీ నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తామన్నారు. సీఈసీ నిర్ణయం ప్రకారం డీఎస్సీ వాయిదా వేయాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

New Update
Mukesh Kumar: డీఎస్సీ వాయిదాపై ఏపీ CEO కీలక వ్యాఖ్యలు..!

CEO Mukesh Kumar Meena: ఏపీలో డీఎస్సీ నోటిపికేషన్‌(DSC Notification)ను ఫిబ్రవరి 7న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 6,100 పోస్టులకు ప్రభుత్వం నోటిపికేషన్‌ను విడుదల చేసింది. రిసెంట్ గా పరీక్షల షెడ్యూల్ లో మార్పులు కూడా చేశారు విద్యాశాఖ అధికారులు. ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 15 వ తేదీ నుంచి డిఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల ఈ పరీక్షలను మార్చి 30 వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై CEO కీలక వ్యాఖ్యలు.. అలా ఉంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే..!

అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో డీఎస్సీ రద్దు చేస్తారా? లేదా వాయిదా వేస్తారా? అని పలు అనుమానలు వ్యక్తం అవుతున్నారు. తాజాగా ఈ విషయంపై CEO ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. డీఎస్సీ పై విద్యాశాఖ వివరణ కొరామన్నారు. విద్యా శాఖ నుంచి వివరణ రాగానే డీఎస్సీ నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తామన్నారు. సీఈసీ నిర్ణయం ప్రకారం డీఎస్సీ వాయిదా వేయాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు