MGNREGA Wages: కేంద్రం గుడ్‌ న్యూస్‌.. ఉపాధి హామీ కూలీల వేతనాలు భారీగా పెంపు

'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ' (MGNREGA) పథకం కింద పనిచేస్తున్న కూలీల వేతనాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రోజూవారి కూలీ వేతనాలు 3 నుంచి 10 శాతానికి పెరగనున్నాయి. ఏప్రిల్ 1, 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

New Update
MGNREGA Wages: కేంద్రం గుడ్‌ న్యూస్‌.. ఉపాధి హామీ కూలీల వేతనాలు భారీగా పెంపు

MGNREGA Wages: 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ' (MGNREGA) పథకం కింద పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2024-2025 ఆర్థిక ఏడాదికి ఉపాధీ హామీ వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. దీంతో కూలీల వేతనాలు 3 నుంచి 10 శాతానికి పెరగనున్నాయి. ఈ ఉపాధి హామీ పథకం వేతనాల పెంపు ఏప్రిల్ 1, 2024 నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Also Read: నిజ్జర్ హత్య కేసుపై మళ్లీ నోరు పారేసుకున్న కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో..

అత్యధికంగా హర్యాణాలో

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో హర్యాణాలో అత్యధికంగా రోజువారి కూలీ వేతనం అత్యధికంగా రూ.374కి చేరనుంది. అత్యల్పంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్‌ రాష్ట్రాల్లో రూ.237కి వేతనం పెరగనుంది. కేరళ రూ.346, మహారాష్ట్ర రూ.297, పంజాబ్‌ రూ.322, రాజస్థాన్‌ రూ.266, తమిళనాడు రూ.319కు పెరగనుంది. వీటితో మరి మిగతా రాష్ట్రాల్లో కూడా వేతనాలు పెరగనున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కూలీ వేతనం రూ.300 పెరగనుంది.

లోక్‌సభ ఎన్నికల ముందు వేతనాల పెంపు 

ఇదిలాఉండగా.. 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ' (MGNREGA) పథకం 2005లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద ప్రజలు, నిరక్షరాస్యులకు ఆర్థిక ఏడాదిలో ఈ పథకం 100 రోజుల పని అందిస్తుంది. గుంతలు తవ్వడం, కాలువలు తీయడం లాంటి పనులు వీళ్లు చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో పనులు లేని సమయంలో పేద కుటుంబాలను ఆదుకునే దిశగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. వేసవిలోనే అత్యధికంగా పనిదినాలు ఉంటాయి. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచూతూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read: ఒత్తిడి ఎక్కువవుతోంది..సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

Advertisment
Advertisment
తాజా కథనాలు