National: ఉద్యోగుల సామాజిక భద్రతకు యూనిఫైడ్ ఫించన్‌ – ‌‌‌23 లక్షల మందికి లబ్ధి

ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పింఛన్ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా 23 లక్షల మందికి లాభం చేకూరనుంది. ఈరోజు ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి వర్గం దీనిని ఆమోదించింది.

National: ఉద్యోగుల సామాజిక భద్రతకు యూనిఫైడ్ ఫించన్‌ – ‌‌‌23 లక్షల మందికి లబ్ధి
New Update

Unified Pension: కేంద్ర కేబినెట్ ఈ రోజు మూడు నిర్ణయాలను తీసుకుంది. బయో ఈ-3 విధానంతోపాటు విజ్ఞాన్‌ ధార పథకం, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కల్పనకు ఆమోదం తెలిపింది. వీటితో పాటూ ఉద్యోగుల భద్రత కోసం యూనిఫైడ్ పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మొత్తం 23 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. దీనిని ఉద్యోగులు ఎన్పీసీ, యూపీఎస్‌ల మధ్య ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

ఈ పథకంలో భాగంగా కనీసం 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు 12 నెలల సగటు మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌గా ఈ పథకం హామీ ఇస్తుంది. ఒకవేళ పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబానికి చివరగా డ్రా చేసిన మొత్తంలో 60 శాతం అమౌంట్ ను పొందుతారు. ఇక ఈ పథకం వలన కనీసం పది ఏళ్ళ సర్వీస్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత నెలకు పదివేలు హామీ ఇస్తుంది. ప్రస్తుత పెన్షన్ స్కీమ్ ప్రకారం.. ఉద్యోగులు 10 శాతం విరాళంగా ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వం 14 శాతం వాటాను అందిస్తోంది. ఇది ఇప్పుడు UPSతో 18 శాతానికి పెరగనుంది.

Also Read: Viral Post: పెద్దగా పని చేయకుండానే 3 కోట్ల జీతం‌‌‌‌–అమెజాన్ ఉద్యోగి పోస్ట్

#employees #centre #launches-unified-pension-scheme
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe