/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-17-jpg.webp)
NEET UG: నీట్, యూజీసీ నెట్ పరీక్షల అవకతవకల ఇష్యూపై కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కమిటీని (High-Level Committee) ఏర్పాటుచేసింది. మొత్తంగా ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ (K Radhakrishnan) నేతృత్వం వహించనున్నారు. ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ డా.రణ్‌దీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ బి.జె.రావు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కె.రామమూర్తి, కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్, ఐఐటీ దిల్లీ డీన్ (విద్యార్థి వ్యవహారాలు) ప్రొఫెసర్ ఆదిత్య మిత్తల్, కేంద్ర విద్యాశాఖ (Ministry of Education) జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.
Ministry of Education constitutes a High-Level Committee of Experts to ensure transparent, smooth and fair conduct of examinations. Committee to make recommendations on Reform in the mechanism of the examination process, improvement in Data Security protocols and structure and… pic.twitter.com/TJ9NqqUJMi
— ANI (@ANI) June 22, 2024
ఇక పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పరీక్ష నిర్వాహణ విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌లో పురోగతి, నిర్మాణం, పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయనుంది. ఈ కమిటీ తన నివేదికను 2 నెలల్లో మంత్రిత్వ శాఖకు సమర్పింస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Former ISRO Chairman and Chairman BoG, IIT Kanpur, Dr K Radhakrishnan will head the High-Level Committee of Experts to ensure transparent, smooth and fair conduct of examinations. pic.twitter.com/z2DgHGBvZd
— ANI (@ANI) June 22, 2024
ఇటీవల నీట్ (NEET), నెట్ ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో కేంద్రం ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను తీసుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా నేరంగా పరిగణిస్తారు. బాధ్యులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
Also Read: ఈ పజిల్‌ను ఫిల్ చేస్తే లక్ష రూపాయలిస్తా.. కల్కి కోసం ఆర్జీవీ బంపరాఫర్