అలెర్ట్ అలెర్ట్.. సెంట్రల్‌ రైల్వేలో 1,303 జాబ్స్‌కి నోటిఫికేషన్‌.. డీటైల్స్‌ చెక్‌ చేసుకోండి!

సెంట్రల్‌ రైల్వే నుంచి 1,303పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ ఫిల్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్‌ 2. అసిస్టెంట్ లోకో పైలట్‌లో మొత్తం 732 ఖాళీలుండగా..టెక్నీషియన్ - 255 ఖాళీలు, జూనియర్ ఇంజనీర్ - 234 ఖాళీలు, గార్డ్/ట్రైన్ మేనేజర్ - 82 ఖాళీలున్నాయి.

అలెర్ట్ అలెర్ట్.. సెంట్రల్‌ రైల్వేలో 1,303 జాబ్స్‌కి నోటిఫికేషన్‌.. డీటైల్స్‌ చెక్‌ చేసుకోండి!
New Update

Central Railway Announces 1303 Vacancies: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(Railway Recruitment Cell) నుంచి కీలక్‌ అప్‌డేట్ వచ్చింది. జూనియర్ ఇంజనీర్, గార్డ్/ట్రైన్ మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ రిలీజ్ అయ్యింది. GDCE కోటాలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1,303 ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్థులు సెంట్రల్ రైల్వేలో రెగ్యులర్ ఉద్యోగులై ఉండాలి. ఆగస్టు 21, 2021కి ముందే రైల్వేలో పని చేయడం స్టార్ట్ చేసి ఉండాలి. పదవీ విరమణ చేసిన వారు అప్లై చేయడానికి అనర్హులు.

పోస్టుల వివరాలు:
• అసిస్టెంట్ లోకో పైలట్ - 732 ఖాళీలు

• టెక్నీషియన్ - 255 ఖాళీలు

• జూనియర్ ఇంజనీర్ - 234 ఖాళీలు

• గార్డ్/ట్రైన్ మేనేజర్ - 82 ఖాళీలు

అర్హత:
అసిస్టెంట్ లోకో పైలట్ - అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్‌కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి మెట్రిక్యులేషన్/ SSLC ప్లస్ ITI ట్రేడ్‌లలో NCVT/ SCVT గుర్తింపు పొందిన సంస్థల నుంచి లేదా వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో 3 సంవత్సరాల డిప్లొమా కలిగి ఉండాలి

• టెక్నీషియన్ - మెట్రిక్యులేషన్ లేదా SSLCతో పాటు NCVT లేదా SCVT ద్వారా గుర్తింపు పొందిన ట్రేడ్ స్కూల్ నుంచి ITI సర్టిఫికేట్.

• జూనియర్ ఇంజనీర్ - పేరున్న యూనివర్సిటీ నుంచి ఏదైనా బేసిక్ స్ట్రీమ్ సబ్‌స్ట్రీమ్‌లో మూడేళ్ల డిప్లొమా.

వయస్సు పరిమితి :

• అన్‌రిజర్వడ్‌ - 42 సంవత్సరాలు

• OBC - 45 సంవత్సరాలు

• SC/ST - 47 సంవత్సరాలు

ముఖ్య తేదీలు:

• నోటిఫికేషన్ ప్రచురణ తేదీ - 1 ఆగస్టు 2023

• ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ ఫిల్‌ చేయడానికి ప్రారంభ తేదీ - 3 ఆగస్టు 2023

• ఆన్‌లైన్ ఫారమ్‌ల సమర్పణకు చివరి తేదీ - 2 సెప్టెంబర్ 2023

• RRC/CR అధికారిక వెబ్‌సైట్ www.rrccr.com ( click here ) ద్వారా అప్లికేషన్‌ని ఫిల్ చేసుకోవచ్చు.

#railway-jobs #indian-railways #central-railway-announces-1303-vacancies #jobs #rlc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి