Kolkata Doctor case: వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఖతమే.. కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్ యాక్షన్!

దేశంలో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులపై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. విధుల్లో ఉన్న డాక్టర్లు, సిబ్బందిపై దాడి జరిగిన 6 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. హాస్పిటల్, కాలేజీ చీఫ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించే బాధ్యత తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Kolkata Doctor case: వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఖతమే.. కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్ యాక్షన్!

Kolkata Doctor Case: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను ఖండించింది. విధుల్లో ఉన్న డాక్టర్లు, సిబ్బందిపై దాడి జరిగిన 6 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ కోరింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించే బాధ్యత హాస్పిటల్, కాలేజీ చీఫ్ దే బాధ్యత అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

పశ్చిమ బెంగాల్ లో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్యాచార కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరు జూనియర్‌ వైద్యులు, ఇతర సీనియర్‌ వైద్యుల ప్రమేయం ఉందని బాధితురాలి పేరెంట్స్ అనుమానిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితురాలితో పాటు కలిసి పని చేసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని తల్లిదండ్రులు తెలిపినట్లు స్పష్టం చేశారు. 30 మందిని పిలిపించి, విచారించాలని నిర్ణయించామని అధికారులు వివరించారు. బాధితురాలు హత్యకు గురైన రోజు ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి సమన్లు జారీ చేశామని తెలిపారు.

Also Read : వైసీపీ బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు