Petrol Prices : పెట్రోల్, డీజిల్ పై రూ.10 తగ్గింపు.. కేంద్రం కీలక ప్రకటన? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.10 నుంచి 15 వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By V.J Reddy 12 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Petrol Prices To Be Reduced : ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ పై దేశ ప్రజలు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం తమపై హామీల వర్షం కురిపిస్తుందని బావిస్తున్నారు. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ తో సంభందం లేకుండా ప్రజలపై పీఎం కిసాన్ లాంటి పథకాలు ప్రవేశపెట్టి ఓటర్లను తమవైపు తిప్పుకుంది. ఈ సారి కూడా బీజేపీ అలానే చేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ALSO READ : తెలంగాణ భవన్‌లో దొంగలు.. బీఆర్ఎస్ నేత జేబులో నుంచి రూ.12 వేలు లూటీ! ఎన్నికలే ఆశలకు కారణం.. మరి కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం మద్యంతర బడ్జెట్ ప్రవేశ పెడుతుండడంతో అందరిలో ఆశలు చిగురించాయి. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తారా?, కొత్త పథకం ఏదైనా ప్రవేశపెట్టనున్నారా? ఇలా అనేక అంశాలపై దేశ ప్రజలు చర్చిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గతంలో బీజేపీ ప్రజలు ఆకట్టుకోడానికి పార్లమెంట్ ఎన్నికల ముందే కొత్త పథకాలను ప్రవేశ పెట్టింది. ఈసారి కూడా అదే విధంగా పథకాలు తెస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి పథకాలు తీసుకొస్తుందనేది వేచి చూడాలి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..? ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి పెరిగిన పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలు భారంగా మారాయి. రోజువారీ ప్రయాణం కోసం వెళ్లే వారికి ఇంధన ఖర్చులు తలనోప్పిగా మారాయి. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. సెంచరీ దాటినా ఇంధన ధరలను తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad) లో పెట్రోల్ ధర రూ.110గా, డీజిల్ ధర రూ.100గా ఉంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.10 నుంచి 15 వరకు తగ్గించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఎన్నికల్లో భారీ మెజారితో బీజేపీ మరోసారి అధికారంలో ఉంటుందని భావిస్తోందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ALSO READ: ఈ రోజు నుంచి స్కూళ్లకు సెలవులు #parliament-budget-sessions #petrol-and-diesel-prices-today #petrol-prices-reduced మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి