CNG Gas: సీఎన్జీ గ్యాస్ రేట్ల పెంపు-కేంద్రం కీలక నిర్ణయం

సీఎన్జీ గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చేశాయి కూడా.

New Update
CNG Gas: సీఎన్జీ గ్యాస్ రేట్ల పెంపు-కేంద్రం కీలక నిర్ణయం

CNG Gas: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దాంతో అందరూ సీఎన్జీ గ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపతున్నారు. దాంతో వాటి వాడకం ఎక్కువైంది. అందుకే ఇప్పుడు కంప్రెస్‌డ్‌ నేచురల్ గ్యాస్‌ ధరలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేజీ సీఎన్‌జీపై రూ.1 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో సీఎన్జీ గ్యాస్ వాహనాలు ఎక్కువగా వాడతారు. దీని కారణంగా ఇప్పుడు ఈ ధరల పెరుగుదల ప్రభావం వారిపై ఎక్కువగా ఉండనుంది. ఢిల్లీలో ప్రస్తుతం కేజీ సీఎన్‌జీ ధర రూ.74.09 నుంచి రూ.75.09కి పెరిగింది. గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌లో రూ.78.70 నుంచి 79.70కి చేరింది. సీఎన్‌జీతో నడిచే ఆటోలు, టాక్సీలు, వ్యక్తిగత వాహనదారులపై కొంత భారం పడనుంది.

Also Read:Elon Musk : 12వ సారి తండ్రి అయిన ఎలాన్ మస్క్..ష్…గప్‌చుప్

Advertisment
తాజా కథనాలు