India: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుకు ముహూర్తం ఫిక్స్!

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. 2024 మార్చిలో 4 శాతం డీఏ పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జనవరి- ఫిబ్రవరి ఎరియర్లతో కలిపి మార్చి జీతంతో డీఏ అందించనున్నట్లు సమాచారం.

New Update
India: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుకు ముహూర్తం ఫిక్స్!

Central Government Employees: డీఏ (Dearness Allowance) పెంపు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రాబోతుంది. 2024 మార్చిలో 4 శాతం డీఏ పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, లెక్కలు పూర్తి అయ్యాయని, జనవరి- ఫిబ్రవరి ఎరియర్లతో కలిపి మార్చి జీతంతో పెంచిన డబ్బులను ఉద్యోగులకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తుల చేస్తున్నట్లు సమాచారం.

ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో..
ఈ మేరకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కుటుంబ సభ్యుల సంఖ్య, ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల కొనుగోలు శక్తిపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. చివరిసారిగా 2023 అక్టోబర్ లో డీఏను, పెన్షనర్లకు డీఆర్ ను నాలుగు శాతం పెంచి ఇచ్చారు. దీంతో డీఏ 42 శాతం నుంచి 46 శాతం పెరిగింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఇప్పుడు మరో నాలుగు శాతం పెంచి మొత్తం 50 శాతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చర్చనడుస్తోంది. అయితే ఈ డీఏ పెంపులో మొత్తం 48.67 లక్షలమంది ఉద్యోగులతో పాటు 67.95 లక్షలమంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు.

ఇది కూడా చదవండి : YSR Rythu Bharosa: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. మూడురోజుల్లో సున్నా వడ్డీ రాయితీ జమ!

ఇక ఈ డీఏ బకాయిల లెక్కింపు ఉద్యోగి పే బ్యాండ్, గ్రేడ్ పే సహా వివిధ అంశాల ఆధారంగా నిర్ణయించనున్నారు. లెవెల్-1లోని ఉద్యోగులు గ్రేడ్ పే రూ.1800, మినిమం బేసిక్‌ శాలరీ రూ.18,000 ఉంటే, డీఏ హైక్ తర్వాత వారి మొత్తం డియర్‌నెస్ అలవెన్సు రూ.774 పెరగనుంది.

Advertisment
తాజా కథనాలు