PM Modi: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్

ఏపీకి మోదీ సర్కార్ తీపి కబురు అందించింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం పూర్తికి పెండింగ్‌ లో ఉన్న వాటితో కలిపి నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.

New Update
Chandra Babu Naidu: రేపు ఢిల్లీకి చంద్రబాబు!

PM Modi: ఈరోజు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం భేటీ అయింది. ఈ భేటీలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఏపీ అభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత ఇచ్చింది. పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించనుంది. జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. పోలవరం పూర్తి అయ్యేందుకు అయ్యే ఖర్చులను కేంద్రం భరిస్తుందని.. ప్రాజెక్ట్ కు అవసరమయ్యే నిధులను అందిస్తామని తెలిపింది. పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

చంద్రబాబు వరుస ఢిల్లీ టూర్లు..

గత పదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ ప్రారంభించారు. ఏపీ అభివృద్ధి విషయంపై పలు మార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తో సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యరు. ఏపీ అభివృద్ధికి కొరకు నిధులు కేటాయించాలని, పెండింగ్ లో ఉంచిన నిధులు మంజూరు చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిధులపై సీఎం చంద్రబాబు వారిని విజ్ఞప్తి చేశారు. కాగా ఏపీ అభివృద్ధికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మల ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి రూ.15 వేల కోట్లను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు