Bank Jobs 2024 : టెన్త్ అర్హతతో 484 బ్యాంక్ జాబ్స్.. అప్లికేషన్ లింక్ ఇదే!

నిరుద్యోగులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. పదో తరగతి అర్హతతో 484 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. అప్లికేషన్ ప్రక్రియ జూన్ 21-27 వ‌ర‌కు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

Bank Jobs 2024 : టెన్త్ అర్హతతో 484 బ్యాంక్ జాబ్స్.. అప్లికేషన్ లింక్ ఇదే!
New Update

Central Bank Of India Recruitment 2024 : నిరుద్యోగులకు (Un Employees) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ సంస్థల్లో ఒకటైన CBI.. ఉద్యోగ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ మేరకు ముంబైలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (HCM) డిపార్ట్‌మెంట్.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో సఫాయి కర్మచారి కమ్​ సబ్​-స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలని తెలిపింది.

మొత్తం పోస్టులు : 484 సఫాయి కర్మచారి కమ్​ సబ్​-స్టాఫ్

విద్యా అర్హత‌లు :
ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి పదో తరగతి (SSC) ఉత్తీర్ణత తప్పనిసరి.

వ‌య‌సు :
2023 మార్చి 31 నాటికి 18 ఏళ్ల నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి.

ద‌ర‌ఖాస్తు ప్రక్రియ:
జూన్ 21 నుంచి 27 వ‌ర‌కు అప్లయ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :
రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, ఈఎస్ఎం, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.175 చెల్లించాలి.

పరీక్ష తేదీ :
2024 జులై/ ఆగస్టు

ఎంపిక :
ఆన్​లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్​నెస్​, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

శిక్షణ కాలం :
ఒక ఏడాది

జీతం :
రూ.19,500 – రూ.37,815 వరకు

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ : https://nats.education.gov.in/

#un-employees #job-notification #central-bank-of-india #recruitment-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe