Centipede in Amul ice cream: మొన్న బిర్యానీలో బల్లీ, నిన్న ఐస్ క్రీమ్ లో తెగిన మనిషి వేలు. నేడు అమూల్ ఐస్ క్రీమ్ లో జెర్రీ దర్శనమివ్వడం ఫుడ్ ప్రియులను కలవరానికి గురిచేస్తోంది. హోటల్ అండ్ ప్యాక్డ్ ఫుడ్ తినాలంటే దడపుడుతోంది. గత వారం రోజులుగా కలుషిత భోజనానికి సంబంధించి వరుస సంఘటనలు వెలుగులోకి వస్తుండగా.. తాజాగా ఓ కస్టమర్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఐస్ క్రీంలో జెర్రీ దర్వనమివ్వడం సంచలనంగా మారింది.
ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ లోని నొయిడాకు చెందిన దీప అనే మహిళ ఆన్ లైన్ డెలివరీ ప్లాట్ ఫామ్ బ్లింకిట్ లో అముల్ ఐస్ క్రీం ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసింది. డెలివరీ అయ్యాక ప్యాకేజీ మూత ఓపెన్ చేసి చూడగా అందులో చనిపోయిన జెర్రి దర్శనమిచ్చింది. వెంటనే బ్లింకిట్ లో కంప్లైంట్ చేయగా తను చెల్లించిన డబ్బును తిరిగి పంపించారు. అయితే ఇంతటితో ఆగకుండా ఇందుకు సంబంధించిన ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. దీంతో అమూల్ కంపెనీ లో ఇలాంటి ఘటన జరగడం పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతుండగా.. అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.