Republic Day 2024: కాగితపు జెండాల పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ .. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు !!

75వ గణతంత్ర దినోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న నేపద్యంలో జాతీయ జెండా వినియోగానికి సంబంధించి కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది.వేడుకల అనంతరం పేపర్ జెండాను కిందపడేసి అగౌరవ పరచవద్దని రాష్ట్రాలకు లేఖ రాసింది.

New Update
Republic Day 2024: కాగితపు జెండాల పై రాష్ట్రాలకు కేంద్రం  లేఖ .. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు !!

Indian National Flag: 75వ గణతంత్ర దినోత్సవాలకు (Republic Day) ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో జెండా వినియోగానికి సంబంధించి కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది.  బారతదేశ త్రివర్ణ  పతాకం దేశానికి గర్వకారణం. ప్రతీ ఒక్క భారత పౌరుడు జాతీయ జెండాకు గౌరవించడం భారతీయులుగా మన  కర్తవ్యం. అయితే .. కొంతమంది జెండా ఎగుర వేసే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. జెండాలను సంరక్షించే విషయంలో కూడా పొరపాట్లు చెస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆగస్టు 15, జనవరి 26 పర్వదినాలలో  వేడుకల సమయాల్లో పేపర్  జెండా వినియోగానికి సంబంధించి కేంద్ర హోం శాఖ (Home Ministry) కొన్ని కీలక సూచనలు చేసింది ఈ మేరకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సర్కులర్ జారీ చేసింది.  జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే, పొరపాట్లు చేస్తే శిక్షార్హులు అవుతారు.

పేపర్ జెండాలను ఇష్టానుసారం పడేయవద్దు 

ముఖ్యంగా జాతీయ దినోత్సవాలలో  వినియోగించే పేపర్  జెండాలను వేడుకలు పూర్తయ్యాక ఇష్టం వచ్చినట్లు కిందపడేస్తు, విసిరెస్తూ  ఉంటారు. ఇలాంటి పనులను నిరోధించాలని , ఆ జెండాలను వినమ్రంగా  డిస్పోస్ చెయ్యాలని సూచించింది.  త్రివర్ణ పతాకం దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతీక ని పేర్కొంటూ ఈ విషయాన్నీ ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్రాలను  కోరింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష
జాతీయ పతాకాన్ని. భారతీయులందరూ గౌరవించాలి. జెండాను ఎగురవేసే  సందర్భాల్లో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే, చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు.గతంలో  జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అనుమతి ఉండేది,కానీ ..ఇప్పుడు జాతీయ పతాకాన్ని రాత్రి వేళల్లో కుడా ఎగురవేయొచ్చు. అలాగే జెండా ను ఎవరయినా ఎగరవేయ్యిచ్చు. నిబంధనలు అతిక్రమించినా , అగౌరవపరచినా చట్టపరమైన చర్యలు తప్పవు.

బిఎస్ఎఫ్ మహిళా సైనిక బృందం కవాతు

ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరగనున్న 75 రిపబ్లిక్ డే వేడుకలకు  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయల్ మేక్రాన్ ముఖ్యఅతిథిగా వస్తుండటంతో ఈ ఏడాది  వేడుకలు  ప్రత్యేకంగా నిలవనున్నాయి మొట్టమొదటిసారి సరిహద్దు భద్రత దళం బిఎస్ఎఫ్ మహిళా సైనిక బృందం కవాతు చేస్తుండటం విశేషం. ఇప్పటికే ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

ALSO READ: నాణ్యత లేని ఆహారం .. ప్రజల ప్రాణాలతో చెలగాటం !! ఈ హోటల్స్ పై కఠిన చర్యలు

Advertisment
తాజా కథనాలు