Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' మూవీ టీమ్ కు షాకిచ్చిన సెన్సార్.. వెంటనే ఆ మార్పులు చేయాలంటూ

రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. అలాగే మూవీ టీమ్‌కు కొన్ని మార్పులు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా రన్‌టైమ్‌ 2 గంటల 38 నిమిషాలు అని సమాచారం.

Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' మూవీ టీమ్ కు షాకిచ్చిన సెన్సార్.. వెంటనే ఆ మార్పులు చేయాలంటూ
New Update

Ravi Teja Mr.Bachchan Movie : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. అంతేకాకుండా సెన్సార్‌ బోర్డు.. మూవీ టీమ్‌కు కొన్ని మార్పులు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాని ప్రకారం.. ఈ మూవీ ఓపెనింగ్‌ సీన్‌లో కనిపించనున్న అమితాబ్‌ బచ్చన్‌, రేఖల ఫొటో స్థానంలో అమితాబ్‌- జయా బచ్చన్‌ల ఫొటోను పెట్టాలని బోర్డు సూచించినట్టు తెలుస్తోంది.

‘ఈ కథ కల్పితం. ఏ వ్యక్తికీ, ప్రాంతానికీ సంబంధింది కాదు’ అనే డిస్‌క్లెయిమర్‌ ప్రదర్శించాలని, రెండు నిమిషాల నిడివి ఉన్న ధూమపానం సీన్‌లో బీడీ స్థానంలో పెన్సిల్‌ రీప్లేస్‌ చేయాలని బోర్డు చెప్పిందని అంటున్నారు. సుమారు 2 గంటల 38 నిమిషాల రన్‌టైమ్‌ తో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Also Read : ఈ సినిమాకు ఒలింపిక్ మెడల్ ఇవ్వాలి.. బాలీవుడ్ మూవీపై మను భాకర్ ప్రశంసలు, రియాక్ట్ అయిన హీరో

కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రవితేజకు కంబ్యాక్ హిట్ అవుతుందనే అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా బుధవారం రాత్రి 7 గంటల 5 నిమిషాల స్పెషల్ ప్రీమియర్స్ తోనే థియేటర్స్ లో సందడి చేయనుంది.

#ravi-teja #mr-bachchan-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe