క్షణంలో మాయ
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సెల్ ఫోన్ దొంగలు రెచ్చిపోయ్యారు. మైలవరం నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దర్జాగా బైక్‌పై వచ్చారు.. క్షణాల్లో సెల్ ఫోన్ కొట్టేశారు ఇద్దరు యువకులు. ఈ ఫోన్ విలువ అక్షరాల 42 వేల రూపాయలు ఉంది. మైలవరం పట్టణంలో నివాసం ఉండే ఓ రిటైర్ బ్యాంక్ మేనేజర్ శ్యామ్‌సన్ స్థానిక సాయి మౌనిక గ్యాస్ ఏజెన్సీకి కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం వెళ్ళారు. ఇంతలో అక్కడకు ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి కింద పడినట్లు నటించి..పైకి లేపెందుకు సహాయం చేయలంటూ కేకలు వేశాడు.
అయితే.. శ్యామ్ సన్ కింద పడిన వ్యక్తిని లేపెందుకు ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడే ఉన్న మరో వ్యక్తి శ్యామ్‌సన్ షర్ట్ జేబులో ఉన్న సెల్ ఫోన్‌ను చాకచక్యంగా దొంగిలించాడు. గ్యాస్ కంపెనీ వద్దగల సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించగా పక్క ప్రణాళికతో ఫోన్ దొంగతనం చేసినట్టుగా కనపడుతోంది. చేసేదేమీ లేక స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు శ్యామ్ సన్. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.