TS Elections 2023 : నేడే తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్.. రాష్ట్రంలో ఓటర్లు మొత్తం ఎంత మందో తెలుసా? తెలంగాణలో ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇటీవల ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,17,17,389 మంది కాగా.. పురుష ఓటర్లు 1,58,71,493 మంది, మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉన్నారు. By Nikhil 09 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TS Elections 2023: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ (Telangana Election Schedule) విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ (Election Commission) విడుదల చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచే కోడ్ (Election Code) అమల్లోకి రానుంది. రాష్ట్రమంతా ఒకే దశలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గతేడాది కూడా ఈ విధంగా నిర్వహించింది. గత ఎన్నికల సమయంలో ఓట్ల గల్లంతు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి అలాంటి మిస్టేక్స్ జరగకుండా చర్యలు చేపట్టింది ఎన్నికల కమిషన్. ఇటీవల తెలంగాణ తుది ఎన్నికల జాబితా కూడా విడుదలైంది. ఆ జాబితా ప్రకారం తెలంగాణలో ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఇది కూడా చదవండి: Breaking News: నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు.. నుంచి నామినేషన్లు.. ముఖ్యమైన తేదీలివే! తెలంగాణలో మొత్తం ఓటర్లు: 3,17,17,389 పురుష ఓటర్లు: 1,58,71,493 మహిళా ఓటర్లు: 1,58,43,339 ట్రాన్స్‌జెండర్ ఓటర్లు: 2,557 దివ్యాంగ ఓటర్లు: 5,06,493 కొత్తగా నమోదు చేసుకున్న వారు: 8,11,640 యువ ఓటర్లు: 5,32,990 ఇదిలా ఉంటే.. తెలంగాణతో పాటు చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేయనుంది. సీఈసీ రాజీవ్ కుమార్ మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో వివరాలను వెల్లడిస్తారు. ఈ ఐదు రాష్ట్రాల్లో నవంబర్ నుంచి డిసెంబర్ మొదటివారంలోగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు గతంలోనే తెలిపాయి. ఇది కూడా చదవండి: TS Opinion Poll 2023: తెలంగాణలో మరో సంచలన సర్వే.. బీఆర్ఎస్ కు తగ్గనున్న సీట్లు.. లెక్కలివే! తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. చత్తీస్ గఢ్ లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17వ తేదీతో ముగియనుంది. తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ గడువు 2024 జనవరిలో వేరు వేరు తేదీల్లో ముగుస్తాయి. #telangana-assembly-elections-2023 #telangana-politics #ts-elections-2023 #telangana-elections-2023 #ts-elections-2023-dates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి