చెడ్డీగ్యాంగ్ తరహాలో చోరీలు చేస్తున్న చుడిదార్ గ్యాంగ్..

హైదరాబాదాలోని SR నగర్ జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో చెడ్డీగ్యాంగ్ తరహాలో చుడీదార్ గ్యాంగ్ చోరీకి పాల్పడింది.వెంకటేశ్వరావు అనే వ్యక్తి ఇంట్లో చుడీదార్ వేసుకుని వచ్చిన దుండగులు 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేసి పరారైయారు.

New Update
చెడ్డీగ్యాంగ్ తరహాలో చోరీలు చేస్తున్న చుడిదార్ గ్యాంగ్..

లాంగ్ వీకెండ్ కోసం ఇంటి నుంచి బయటకి వెళ్తున్నారా అయితే జాగ్రత్త.. మీరు ఇంటికి తిరిగొచ్చేలోపు ఇల్లు గుల్లయ్యే అవకాశముంది. దుండగలు ఎప్పటికప్పుడు నూతన పందాలో చోరీలు చేస్తు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ శివార్లలో చెడ్డీ గ్యాంగ్ పలు నివాసాలు పై దాడులు చేసి.చోరీలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.అలాంటిదే ఇప్పుడు తాజాగా హైదరబాద్ లో ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో జరిగింది.

జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో కి ఇద్దరు దుండగులు చుడిదార ధరించి చొరబడ్డారు.ఎవరూ లేరని గ్రహించి ఆ ఇద్దరు నిందితులు చాకచక్యంగా ఇంటిలోని విలువైన 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేసి పరారైన దృశ్యాలు సీసీటీవీలో దర్శనమిచ్చాయి.వీకెండ్ కావటంతో కుటుంబంతో బయటకు వెళ్లోచ్చిన వెంకటేశ్వరావుకు ఇంటిలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలన్ని పరిశీలించి సీసీటీవీను చెక్ చేశారు.ఇద్దరు దుండగులు చుడిదార్ దుస్తుల్లో వచ్చి చోరీకి పాల్పడినట్లు నిర్థారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు