వైసీపీ పాలనలో నియోజకవర్గానికో సైకో వస్తున్నాడు..తాట తీస్తా జాగ్రత్త!

ఆంధ్రప్రదేశ్‌ లో వైసీపీ పాలనలో సైకోలు ఎక్కువ మంది తయారవుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. మంగళవారం నుంచి గురువారం వరకు ఏపీ వ్యాప్తంగా ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటించారు.

New Update
వైసీపీ పాలనలో నియోజకవర్గానికో సైకో వస్తున్నాడు..తాట తీస్తా జాగ్రత్త!

ఆంధ్రప్రదేశ్‌ లో వైసీపీ పాలనలో సైకోలు ఎక్కువ మంది తయారవుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. మంగళవారం నుంచి గురువారం వరకు ఏపీ వ్యాప్తంగా ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటించారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. నియోజకవర్గానికి ఒక సైకో తయారవుతున్నారని ఆయన విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పై యుద్ధభేరి ప్రకటించాలని..అందుకే ఈరోజు నేను ప్రజల మధ్యకి వచ్చానని ఆయన పేర్కొన్నారు.

రత్నాల సీమలా ఉన్న రాయలసీమకు జగన్ ద్రోహం చేశారు. సీమ కోసం జగన్ ఏనాడైనా పని చేశారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

వైసీపీ వారి అండ చూసుకుని రౌడీయిజం చేస్తే రానున్న రోజుల్లో తాట తీస్తానని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చంద్రబాబు బహిరంగ సభలో హామీ ఇచ్చారు.

అంతేకాకుండా ప్రస్తుతం ఏపీలో మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అసలు రాష్ట్రంలో మహిళలకు రక్షణే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జాబు కావాలంటే మాత్రం బాబు రావాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.

నడిచేందుకు సరైన రోడ్లు లేవు కానీ..మూడు రాజధానులు కడతారంట అని వ్యంగ్యాస్త్రాలు అధికార పార్టీ మీద సంధించారు. రోడ్డు మీద ఉన్న గుంతలు పూడ్చలేరు కానీ..మూడు రాజధానులు నిర్మించేస్తారంటా అని ఆయన ఎద్దేవా చేశారు.

‘‘ఒక రాజధానిని నాశనం చేసి మూడు రాజధానులని అంటున్నారు. మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం” అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు మద్యం ప్రియులకు మంచి కిక్‌ ఇచ్చే వార్తను కూడా చెప్పారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలను తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాసిరకం మద్యాన్ని విక్రయిస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో విచిత్రమైన బ్రాండ్లను అమ్ముతున్నారన్నారు. వాటిని తాగడం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మరో 6 నెలలు ఆగితే మీ బతుకులను బాగు చేస్తానని చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు