Megha Krishna Reddy: మేఘా కృష్ణారెడ్డికి షాక్.. సీబీఐ కేసు నమోదు

మేఘా కృష్ణారెడ్డికి షాక్ ఇచ్చింది సీబీఐ. మేఘా కృష్ణారెడ్డి కి షాక్ ఇచ్చింది సీబీఐ. ఎన్‌ఐఎస్‌పి సంబంధించిన రూ. 315 కోట్ల ప్రాజెక్ట్‌లో అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన సీబీఐ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసింది.

Megha Krishna Reddy: మేఘా కృష్ణారెడ్డికి షాక్.. సీబీఐ కేసు నమోదు
New Update

Megha Krishna Reddy: మేఘా కృష్ణారెడ్డి కి షాక్ ఇచ్చింది సీబీఐ. ఎన్‌ఐఎస్‌పి సంబంధించిన రూ. 315 కోట్ల ప్రాజెక్ట్‌లో అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన సీబీఐ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌తో పాటు స్టీల్ మంత్రిత్వ శాఖలోని ఎన్‌ఎండిసి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్‌కు చెందిన ఎనిమిది మంది అధికారులపై 120బీ ఐపీసీ, ఐపీసీ 465, సెక్షన్ 7,8 &9 కింద కేసు నమోదు చేసింది.

ఇటీవల తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేఘా కృష్ణారెడ్డి భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే..  ఎలక్టోరల్ బాండ్ల విషయంలోనూ అధికార, ప్రతిపక్ష పార్టీలకు మేఘా కృష్ణారెడ్డి భారీగా విరాళాలు అందించినట్లు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నివేదికలో బయటపడింది. దీంతో తాను చేసిన అవినీతి బయటపడకుండా ఉండేందుకే పార్టీలకు భారీగా విరాళాలు ఇచ్చినట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి.

అధికారులకు రూ.78 లక్షల లంచం..

జగదల్‌పూర్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పనులకు సంబంధించి మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీకి చెందిన రూ. 174 కోట్ల బిల్లులను క్లియరింగ్‌ చేసేందుకు ఎన్‌ఐఎస్‌పి, ఎన్‌ఎండిసికి చెందిన ఎనిమిది మంది అధికారులకు అలాగే మెకాన్‌ కంపెనీకి చెందిన ఇద్దరు అధికారులకు రూ. 78 లక్షలు లంచం ఇచ్చారు మేఘా కృష్ణారెడ్డి. మొత్తం ఈ 10 మంది అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో పాటు క్రాస్ కంట్రీ పైప్‌లైన్ పనులకు సంబంధించిన రూ.315 కోట్ల ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్ తనకు వచ్చేందుకు అధికారులకు లంచం ఇచ్చినట్లు సీబీఐ గుర్తించింది.

కాళేశ్వరం కరప్షన్ మేఘా కింగ్..

కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టులో రూ.50వేల కోట్లు కొట్టేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా కృష్ణారెడ్డి(Megha Krishna Reddy) తెలంగాణ(Telangana) లోని ఇతర ప్రాజెక్టుల్లోనూ భారీగా దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో దాదాపు రూ.70వేల కోట్లు కొట్టేసినట్లు గతంలో ప్రతిపక్ష పార్టీలు లెక్కలతో సహా చూపించగా.. ఇప్పుడు కొత్తగా మేఘా కంపెనీ మరో బండారం బయటపడింది. 

మేఘా కొట్టేసిన అవినీతి సొమ్ము..

సీతారామ ప్రాజెక్టు(Sita Rama Project) లోనూ మేఘా కృష్ణారెడ్డి రీడిజైన్‌ పేరుతో వేల కోట్లు కొట్టేశారు. రూ.1500 కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టు అంచనాలను రూ.22,981 కోట్లకు పెంచారు. ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తోంది మేఘా కొట్టేసిన అవినీతి సొమ్ము ఎంతుంటుందో. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం రూ.7500 కోట్లకు పైగానే ఖర్చు పెట్టేసింది కూడా. అయితే ఇంత వరకు ఒక్క పని పూర్తి కాలేదు. చిన్న చిన్న పనులు చేసి వేల కోట్ల రూపాయలు నొక్కేశారు. రూ.3,32,000 ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ పదేళ్లు దాటినా ఒక్క చుక్క నీరు పారలేదు. రాష్ట్ర విభజనకు ముందు ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ.2000 కోట్లు ఆనాటి సర్కారు ఖర్చు చేసింది. మరో 15 వందల కోట్లు ఖర్చు పెడితే లక్షలాది ఎకరాలకు నీళ్లు పారేవి. దీన్నే అదునుగా భావించిన మేఘా కృష్ణారెడ్డి ప్రాజెక్టు రీడిజైన్‌ పేరిట అంచనాలు భారీగా పెంచేశాడు. దాదాపు రూ. 20వేల కోట్ల రూపాయలు నొక్కేసేందుకు పథకం రచించాడు. సీతమ్మ సాగర్‌ బ్యారేజీ, టన్నెల్‌ అంటూ  మేఘా కంపెనీ రూ.23 వేల కోట్లకు అంచనాల లెక్క చూపించింది .

#megha-krishna-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe