/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CBI-JD--jpg.webp)
ఆంధ్రప్రదేశ్ లో మరో నూతన రాజకీయ పార్టీ పురుడు పోసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సాయంత్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి వైజాగ్ ఎంపీగా ఆయన పోటీ చేశారు. రైతు, ప్రజా సమస్యలు, యువతకు ఓటింగ్ పై అవగాహన తదితర కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. ఈ రోజు కొత్త పార్టీపై ఆయన కీలక ప్రకటన చేస్తారంటూ సన్నిహితులు చెబుతున్నారు.
అర్థరాత్రి ఆలోచన చేద్దాం రండి.. అంటూ మరో నూతన పోగ్రామ్ కి ఆయన శ్రీకారం చుట్టారు. వివిధ రాజకీయ పార్టీలు, మేధావులతో ఇప్పటికే జేడీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ గతంలోనే ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు జేడీ ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ ఏపీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే.. ఆయన పార్టీలో ఎవరెవరు చేరుతారనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..
Follow Us