BREAKING: వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్!

వైఎస్ భాస్కర్ రెడ్డికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సీబీఐ కోర్టు. ఈ నెల 30వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.

New Update
BREAKING: వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్!

YS Viveka Murder Case: ఏపీలో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16వ తేదీన భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను సీబీఐ కోర్టు మంజూరు చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్‌ ఒకటో తేదీ ఉదయం 10.30 గంటలకు చంచల్ గూడ జైలుకు వెళ్లాలని భాస్కర్ రెడ్డిని ఆదేశించింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఎస్కార్ట్ బెయిల్‌పై వైఎస్ భాస్కర్ రెడ్డి ఉండగా.. తాజాగా ఎస్కార్ట్ బెయిల్‌ను మధ్యంతర బెయిల్‌గా సీబీఐ కోర్టు మార్చింది.

Also Read: విద్యార్థులకు GOOD NEWS.. సెలవులు పెంపు!

భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు పెట్టిన షరతులు:

తన పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డిని ఆదేశించింది. దాంతో పాటు తాను ఉంటున్న చిరునామా కోర్టుతో పాటు సీబీఐ అధికారులకు ఇవ్వాలని పేర్కొంది.. అత్యవసర సమయంలో చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లాలని అనుకుంటే సీబీఐ అధికారులకు తెలపాలని వివరించింది. ఈ బెయిల్ సమయంలో కుటుంబ సభ్యులను తప్ప మిగతా ఎవరినీ కలవొద్దని హెచ్చరించింది.

Advertisment
తాజా కథనాలు