Caucasian Shepherd : హైదరాబాద్‌కి సింహం లాంటి కుక్క.. ధర రూ.20 కోట్లు..!

దేశంలోనే అత్యంత కాస్ట్‌లీ కుక్కైన కాకేసియన్ షెపర్డ్‌ హైదరాబాద్‌కు వచ్చింది. హెల్త్‌ బాగోపోవడంతో మదీనాగూడలోని 'విశ్వాస్‌పెట్‌' క్లీనిక్‌కి తీసుకొచ్చారు. ఈ కుక్క ధర రూ.20కోట్లు ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్‌కు చెందిన సతీశ్‌ గతంలో ఈ కుక్కను కొనుగోలు చేశాడు.

Caucasian Shepherd : హైదరాబాద్‌కి సింహం లాంటి కుక్క.. ధర రూ.20 కోట్లు..!
New Update

Caucasian Shepherd : కుక్కే కదా అని తీసిపారేయకండి.. దీని ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు. వెయ్యి కాదు పది వేలు కాదు.. లక్ష కాదు.. కోటి కాదు.. ఏకంగా రూ.20కోట్లు..! అవును.. ఈ కుక్క ప్రపంచంలోనే వన్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ కాస్ట్‌లి కుక్క. కాకేసియన్ షెపర్డ్‌గా పిలుచుకునే ఈ కుక్క హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఈ రిచ్‌ కుక్కకు పాపం హెల్త్ బాలేదంట. అందుకే భాగ్యనగరానికి తీసుకొచ్చారు. మదీనాగూడలోనే 'విశ్వాస్‌పెట్‌(Vishva's Pet)' క్లీనిక్‌కి తీసుకొచ్చి చికిత్స చేశారు.

హైదరాబాద్‌ నుంచే కొనుగోలు:
కాకేసియన్ షెపర్డ్‌ బ్రీడ్‌కు చెందిన ఈ కుక్క పేరు 'కాడబోమ్ హేడర్'. దీనికి సతీశ్‌ కెన్నెల్ పేరు పెట్టారు. ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్‌కు చెందిన సతీశ్‌కు కుక్కలు పెంచుకోవడం అలవాటు. చాలా కాస్ట్‌లి కుక్కలను పెంచుకుంటాడు. 2016లో సతీశ్‌ రెండు కొరియన్ మాస్టిఫ్‌లను కొనుగోలు చేశాడు. రెండు రోరియన్‌ మాస్టిఫ్‌లు ఉన్న మొదటి వ్యక్తి అతనే. వీటి ధర ఒక్కొక్క కుక్కకు కోటి రూపాయలు. చైనా నుంచి మాస్టిఫ్‌ కుక్కలను దిగుమతి చేసుకున్నాడు. విమానాశ్రయం నుంచి రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్‌లో వాటిని తీసుకురావడం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన కాకేసియన్ షెపర్డ్‌ బ్రీడ్‌ మూలాలు కూడా భాగ్యనగరానికి చెందినవేగా తెలుస్తోంది. దేశంలోనే అరుదైన ఈ కాకేసియన్ షెపర్డ్‌ జాతి కుక్కను హైదరాబాద్‌(Hyderabad) లోని ఓ పెంపకందారుడి నుంచి సతీశ్‌ గతంలో కొనుగోలు చేశాడు. ఇప్పుడు దాని వయసు సుమారు రెండేళ్లు.

బాబోయ్‌ ఇది సింహమే :
పేరుకే కుక్క కానీ.. ఇది కుక్కలా కాదు.. సింహలా ఉంటుంది. కాడబోమ్ హేడర్ ఎత్తు ఆరు అడుగులు. 110 కేజీల బరువు ఉంటుంది. ఈ కుక్క కాలు రెండు సోడా బాటిల్స్‌ అంత సైజ్‌లో ఉంటుంది. ఈ కుక్క గతంలో అనేక ఘనతలు కూడా సాధించింది. గతంలో త్రివేండ్రం కెన్నెల్ క్లబ్ ఈవెంట్‌లో ఈ హేడర్‌ పాల్గొంది. మొత్తం 32 పతకాలను కూడా గెలుచుకుంది. ఈ కుక్క నిర్వహణకు సతీశ్‌ ప్రతిరోజూ దాదాపు రూ.2,000 వెచ్చిస్తున్నాడు. ఈ కుక్కను కొనుగోలు చేసేందుకు కోట్లకు కోట్లు ఇస్తామన్నా సతీశ్‌ ఒప్పుకోలేదు. హెడర్‌ ఎయిర్ కండిషన్డ్ హౌస్‌లో ఉంటుంది. ఇక సతీశ్‌ ఇదే జాతికి చెందిన రెండు కుక్క పిల్లలను కూడా కొన్నాడు. రూ.5 కోట్లకు కొనుగోలు చేశాడు. వీటి అదనపు సంరక్షణ, పోషకాహారంతో పాటు కుక్కలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని చూసుకోవడానికి మనుషులు కూడా ఉన్నారు. ఇక ఇటీవలి ఓ డాక్యూమెంటరీ మూవీలో కూడా మెరిసింది.

ఈ కుక్క చాలా డేర్‌:
కాకసియన్ షెపర్డ్ డాగ్‌లు కాపలా కుక్కలు. ఇవి చాలా నిర్భయమైన, ధైర్యంగా ఉంటాయి. అటు దయ కూడా కాస్త ఎక్కువే. ఇది జార్జియా, అర్మేనియా అజర్‌బైజాన్, ఒస్సేటియా, డాగేస్తాన్‌తో పాటు రష్యాలోని కొన్ని ప్రాంతాలకు చెందినది. అమెరికన్ కెన్నెల్ క్లబ్ ప్రకారం, శతాబ్దాలుగా.. ఈ జాతి అక్రమార్కుల నుంచి ఆస్తులను రక్షించడానికి, తోడేళ్ళు, కొయెట్‌ల లాంటి పెద్ద , చిన్న మాంసాహారుల నుంచి పశువులను రక్షించడానికి ఉపయోగిస్తున్నారు. డెన్మార్క్‌లో ఈ జాతిని నిషేధించారు.

Also Read: శబరిమల అయ్యప్ప 18 మెట్ల పేరేంటో తెలుసా?వాటి వెనకున్న రహస్యం తెలుస్తే షాక్ అవ్వడం పక్కా..!!

#hyderabad #dog #caucasian-shepherd
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe