/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-3.jpg)
Casting couch: కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలో భాగంగా.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ హేమలాంటి కమిషన్ ఏర్పాటు చెయ్యాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని నటి సమంత కోరిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సమంతకు మద్ధతుగా సీనియర్ నటి అనుష్క శెట్టి సైతం తెలుగు చిత్రపరిశ్రమలోకి హేమ కమిటీని స్వాగతిస్తున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
View this post on Instagram
ఈ మేరకు ఇన్ స్టా వేదికగా స్టోరీ పోస్ట్ చేసిన అనుష్క.. 'తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమానికి మార్గం వేసిన WCCin కేరళను అభినందిస్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లో మహిళల కోసం ఒక సపోర్ట్ గ్రూప్ 'ది వాయిస్ ఆఫ్ ఉమెన్' 2019లో ఏర్పాటు చేయబడింది. సినీ పరిశ్రమ విధానాలను రూపొందించడంలో సహాయపడే లైంగిక వేధింపులపై సమర్పించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది' అని రాసింది అనుష్క.
Follow Us