Cashews: జీడిపప్పులో జీరో కొలెస్ట్రాల్.. ఎంత తింటే అంత మేలు

జీడిపప్పులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ పప్పులు నిత్యం తిన్నా కూడా చెడు కొలెస్ట్రాల్ పెరగదని నిపుణులు చెబుతున్నారు. మాంసాహారంలో కొలెస్ట్రాల్ డైరెక్ట్ గా ఉంటుంది. వీటిలో ఉండే పోషకాలు, విటమిన్‌లు, ఖనిజాలు అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

New Update
Cashews: జీడిపప్పులో జీరో కొలెస్ట్రాల్.. ఎంత తింటే అంత మేలు

Cashews: జీడిపప్పులో ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతిరోజు తీసుకుంటే అనేక ప్రయోజనాలతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటిలో ఉండే పోషకాలు, విటమిన్‌లు, ఖనిజాలు అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే కొందరిలో జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే అపోహ ఉంటుంది. కానీ అలాంటి అపోహలు పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

publive-image

జీడిపప్పు అంత రుచైనా పప్పు మరొకటి ఉండదని మనందరికీ తెలుసు. కొద్దిగా తింటే బాగుండని కోరుకున్నప్పటికీ అవి తింటే కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుందని చాలామంది భయపడుతారు. దీంతో కొందరూ తినటం కూడా మానేస్తూ . పిల్లలు కూడా పెట్టాలంటే కూడా ఆలోచిస్తారు. అయితే ఇందులో యదార్థం ఏమిటంటే జీడిపప్పులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ పప్పులు రోజు తిన్న లైఫ్‌లో చెడ్డ కొలెస్ట్రాల్ అసలు పెరగదని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ గురించి ఒక మొండి గుర్తు పెట్టుకోవాలని కూడా సూచిస్తున్నారు. అది ఏమిటంటే జంతు సంబంధించిన ఆహారాల అన్నింటిలోనూ కొలెస్ట్రాల్ డైరెక్టుగా ఉంటుంది, వృక్ష సంబంధమైన ఆహారాలు ఎందులోనూ కొలెస్ట్రాల్ ఉండదట. జీడిపప్పు అనేది జీరో కొలెస్ట్రాలను గుర్తుపెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పును నానబెట్టి తిన్నా, ఒట్టిగా తిన్నా.. వేయించుకొని తిన్నా కొలెస్ట్రాల్ మాత్రం రాదని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఆయిల్ టిఫిన్స్ వద్దు.. చద్దన్నం ముద్దు!

Advertisment
Advertisment
తాజా కథనాలు