ఎన్నికల వేళ పోలీసులు సీజ్ చేసిన డబ్బు, బంగారం విలువ ఎంతో తెలుసా? లెక్క చూస్తే గుడ్లు తేలేస్తారు..

గడిచిన మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేశారు అధికారులు. రూ. 86.92 లక్షల విలువైన మద్యం, రూ. 89.02 లక్షల విలువైన మత్తు పదార్థాలు, రూ. 14.65 కోట్ల విలువైన బంగారం, వెండి, డైమండ్స్ స్వాధీనం చేసుకుకన్నారు. ఈ లెక్కలకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం పై హెడ్డింగ్ కిక్ చేయండి.

Telangana: తెలంగాణ వ్యాప్తంగా రూ.155 కోట్లు సీజ్
New Update

Cash, Gold, Liquor worth 37.07crore seized in 3days: తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఇంకేముంది.. డబ్బు, బంగారం, ఆభరణాలు, గిఫ్ట్స్ వరదలా పారుతున్నాయి. పోలింగ్‌కు పట్టుమని 50 రోజులు కూడా లేకపోవడంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు అవసరమైన సరంజామాను సమకూర్చుకుంటున్నాయి. అయితే, వీరి ఏర్పాట్లను చూస్తూ ఎన్నికల కమిషన్ ఊరుకుంటుందా? ఛాన్సే లేదు. ఎక్కడికక్కడ పటిష్టమైన పహారా ఏర్పాటు చేసింది. పోలీసులు డేగ కళ్లతో డబ్బు, నగదు, బంగారం, వెండి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తున్నారు. అడుగడుగునా.. నిఘా పెట్టి.. అక్రమంగా తరలిస్తున్న కట్టల కొద్ది డబ్బును, కిలోల కొద్ది బంగారం, వెండిని, కాటన్ల కొద్ది మద్యం బాటిళ్లను సీజ్ చేస్తున్నారు అధికారులు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడమే ఆలస్యం అన్నట్లుగా.. గుట్టు చప్పుడు కాకుండా డబ్బు, మద్యం, బంగారం, వెండిని ఒక చోట నుంచి మరొక చోటకు తరలిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దరిమిలా.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మూడు రోజుల్లోనే.. భారీగా డబ్బు, మద్యం, బంగారం, వెండి పట్టుబడటం చూస్తేనే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేశారు అధికారులు. ఈ లెక్కలకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రకటించారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ మూడు రోజుల్లో సీజ్ చేసిన డబ్బు, బంగారం, మద్యం వివరాలివే..

అక్టోబర్ 9వ తేదీ నుంచి 12వ తేదీ ఉదయం వరకు మొత్తం రూ. 20,43,38,375 కోట్లు నగదు సీజ్ చేశారు అధికారులు. అదే సమయంలో రూ. 86,92,533 లక్షల విలువైన మద్యం, రూ. 89,02,825 లక్షల విలువైన డ్రగ్స్, గంజాను స్వాధీనం చేసుకున్నారు. ఇక రూ. 14,65,50,852 కోట్ల బంగారం, వెండిని సీజ్ చేశారు అధికారులు. ఇందులో 31.979 కేజీల బంగారం, 350 కేజీల వెండి, 42.203 క్యారెట్ల డైమండ్స్‌ను సీజ్ చేశారు. రూ. 22.5 లక్షల విలువైన 7,040 కేజీల రైస్, 440 చీరలు, 80 కుట్టు మెషీన్లు, 87 కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇప్పుడే ఈ రేంజ్‌లో డబ్బు, బంగారం, మద్యం పట్టుబడితే.. ఎన్నికల నాటికి ఇంకెంత పట్టుబడుతుందో చూడాలి మరి.

publive-image

Also Read:

స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ఇండియా,అఫ్ఘాన్‌ మ్యాచ్‌ సమయంలో ఏం జరిగిందంటే?

 శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

#telangana-news #telangana-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe