EX CM Jagan: మాజీ సీఎం జగన్ పై నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. గుంటూరు జైలులో కస్టడీలో ఉన్నప్పుడు తనపై హత్యాయత్నం జరిగిందని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చి ఫిర్యాదు మేరకు సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 506(34) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. FIRలో A3గా జగన్ పేరు చేర్చారు పోలీసులు. A2గా మాజీ ఇంటెలీజెన్స్ చీఫ్ రామాంజనేయులు, ఏ1గా మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పేరును నమోదు చేశారు. A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతి పేర్లను చేర్చారు పోలీసులు. కాగా జగన్ పై కేసు నమోదు చేయడాన్ని వైసీపీ శ్రేణులు ఖండిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతోనే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని మండిపడుతున్నారు.
జగన్ పై కేసు.. పీవీ సునీల్ రియాక్షన్..
వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదు కావడంపై ఘాటుగా స్పందించారు మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్. సుప్రీం కోర్టులో మూడేళ్ళు నడిచి … సాక్షాత్తూ సుప్రీం కోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా FIR వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ ట్విట్టర్ (X)లో పోస్ట్ చేశారు.