Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు

AP: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు వరలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే ఆయనను పార్టీ నుండి టీడీపీ సస్పెండ్ చేసింది.

Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు
New Update

TDP MLA Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌ కేసు నమోదు (Case Filed) అయింది. బాధితురాలు వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. సెక్స్ వల్ హెరాస్‌మెంట్ చేస్తూ, శారీరకంగా అనుభవిస్తూ, తనని రేప్ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105, 109లో తన ప్రమేయం లేకుండా అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. BNS Cr:430/2024 సెక్షన్ల కింద ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. భీమాస్ పారడైజ్ హోటల్‌లో సీసీ పుటేజీని పోలీసులు సేకరించారు. నేడో, రేపో తన ఎమ్మెల్యే పదవి ఆదిమూలం కి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు సీరియస్...

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. టీడీపీ మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపుల ఇష్యూలో ఆదిమూలంను సస్పెండ్ చేసింది. అశ్లీల వీడియోల వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఆదిమూలంపై వేటు వేశారు. అంతేకాదు ఆదిమూలంను త్వరలోనే పదవికి రాజీనామా చేయించాలని చంద్రబాబు ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే త్వరలో సత్యవేడులో ఉప ఎన్నిక రానుంది.

#tdp-mla-koneti-adimulam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe