Chamala Kiran Kumar: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

TG: భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌పై కేసు నమోదైంది. రాగన్నగూడలో 200 గజాల ప్లాట్‌ కబ్జా చేశారని రాధిక అనే మహిళా ఫిర్యాదు చేయడంతో ఆదిభట్ల పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఆయనపై సెక్షన్‌ 447, 427, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
TGPSC Group-2 Exam: గ్రూప్-2 వాయిదా.. కాంగ్రెస్ ఎంపీ కీలక ప్రకటన

Chamala Kiran Kumar:భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌పై కేసు నమోదైంది. ఈ నెల 13న కోర్టు ఆదేశాలతో ఆదిభట్ల పీఎస్‌లో కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. చామల కిరణ్‌కుమార్‌రెడ్డిపై రాధిక అనే మహిళ భూకబ్జా ఫిర్యాదు చేసింది. రాగన్నగూడలో 200 గజాల ప్లాట్‌ కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఆదిబట్ల పీఎస్‌లో చామల కిరణ్‌పై సెక్షన్‌ 447, 427, 506 కింద కేసు నమోదు చేశారు. ఆ ప్లాటును కిరణ్‌ కుమార్‌ 2003 లోనే కొన్నట్లు డాక్యుమెంట్లు ఉన్నాయని సీఐ తెలిపారు. అదే విధంగా రాధిక అనే మహిళా కూడా 2015లో ఆ ప్లాటు కొన్నట్లు డ్యాక్యుమెంట్‌ ఉన్నాయని సీఐ వివరించారు. ఇద్దరి డాక్యుమెంట్లు తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తామని సీఐ మీడియాకు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు