/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/madhavi-jpg.webp)
BJP MP Candidate Madhavi Latha:హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పాతబస్తీలోని పోలింగ్ కేంద్రాల్లో మాధవీలత ఓవర్ యాక్షన్ చేశారు. ముస్లిం మహిళల బుర్ఖాలు తీసి వారి ఓటర్ స్లిప్ల్ లను చెక్ చేశారు. మాధవీలత అలా చేయడంపై పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఆమె వినిపించుకోకుండా మిగతా ముస్లిం మహిళలను చెక్ చేశారు. కాగా ఓటు వేసేందుకు వచ్చిన తమకు మాధవీలత వల్ల అవమానం జరిగిందని సదరు మహిళలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం మాధవీలత చేసిన పనిని ఖండించింది. ఆమెపై సీరియస్ అయింది. మాధవీలతపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశాలు. ఈసీ అదెహస్లా మేరకు మలక్ పేట మాధవీలతపై కేసు నమోదు చేశారు.
Follow Us