Telangana Elections: సీఐపై రెచ్చిపోయిన అక్బరుద్దీన్.. రివర్స్ షాక్ ఇచ్చిన ఖాకీలు..

ఎన్నికల ప్రచారంలో సీఐని దూషించిన ఘటనలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై సంతోష్ నగర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. పీపీసీ సెక్షన్ 353,153(a),506,505(2) & 125 RP ప్రకారం కేసు బుక్ చేశారు.

New Update
Telangana Elections: సీఐపై రెచ్చిపోయిన అక్బరుద్దీన్.. రివర్స్ షాక్ ఇచ్చిన ఖాకీలు..

Case registered on Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ఎంఐఎం ఫ్లోర్ లీడర్, చంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్ నగర్ సీఐ నుంచి బెదిరించిన ఘటనలో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్ 353,153(a),506,505(2) & 125 ఆర్పీ ప్రకారం సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాడు చంద్రాయణగుట్టలోని లలిత్ భాగ్‌లో అక్బరుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల వరకే ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే సమయం ముగుస్తుండటంతో సంతోష్ నగర్ సీఐ.. అక్బరుద్దీన్‌ను హెచ్చరించారు. ప్రచారం ముగించాలంటూ వారించారు.

దీంతో అక్బరుద్దీన్ ఓవైసీ.. సీఐపై విరుచుకు పడ్డారు. తన నోటికి పని చెప్పారు. సీఐకే ధమ్కీ ఇచ్చారు. తాను ఒక్క సైగ చేస్తే చంద్రాయణ గుట్ట ప్రజలు ఉరికిస్తారని వ్యాఖ్యానించారు. పరుష వ్యాఖ్యలతో సీఐపై ఊగిపోయారు. ఇంకా 5 నిమిషాలు సమయం ఉన్నప్పటికీ.. ముందే ఎలా వార్నింగ్ ఇస్తారంటూ ఫైర్ అయ్యారు. తన వద్ద కూడా వాచ్ ఉందని, తనను ఆపే వ్యక్తి ఇంకా ఎవరూ పుట్టలేదని వ్యాఖ్యానించారు. అవసరమైతే తాను ఇంకా మాట్లాడుతానని అన్నారు అక్బరుద్దీన్.

అయితే, తననే అడ్డుకుంటావా? అంటూ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు అక్బరుద్దీన్. తనను ఎవరూ ఆపలేరని అన్నారు. తాను సైగ చేస్తే పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కత్తి పోట్లు, బుల్లెట్ గాయాలు అయ్యాయని, తన పని అయిపోయిందని అనుకుంటున్నారేమో.. ఇంకా అదే ఆవేశం.. అదే దమ్ము నాలో ఉందంటూ రెచ్చిపోయారు అక్బరుద్దీన్. 'పరుగులు పెట్టిద్దామా? నేను అలిసిపోయానని అనుకుంటున్నారు.. మన పని అయిపోయిందనుకుంటున్నారు. కానీ, వారికి మనమేంటో చూపించాలి. అక్బరుద్దీన్ ఓవైసీతో పోటీ చేయడానికి వస్తున్నారు. రానీయండి. వాళ్లు గెలుస్తారో.. మనం గెలుస్తామో చూద్దాం' అంటూ ప్రజలనుద్దేశించి ఆవేశంగా ప్రసంగించారు అక్బరుద్దీన్ ఒవైసీ.

Also Read:

కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..

కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు..

Advertisment
తాజా కథనాలు