Bitthiri Sathi: నటుడు బిత్తిరి సత్తిపై కేసు నమోదు

నటుడు బిత్తిరి సత్తిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. భగవద్గీతను కించపర్చేలా వీడియో చేశాడని బిత్తిరి సత్తిపై వానరసేన ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

Bittiri sathi: బిత్తిరి సత్తిపై మరో కేసు నమోదు.. బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్న హిందూ సంఘాలు!
New Update

Bitthiri Sathi: నటుడు బిత్తిరి సత్తిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. భగవద్గీతను కించపర్చేలా వీడియో చేసాడని బిత్తిరి సత్తిపై వానరసేన ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. బిత్తిరి సత్తి అసలు పేరు రవి. ప్రముఖ ఛానెల్ లో యాంకర్ గా చేసిన బిత్తిరి సత్తి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాతసొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని.. వినోదకర వీడియోలు తీస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్, బిజినెస్ ప్రమోషన్స్ చేసుకుంటూ తన కెరీర్ లో దూసుకుపోతున్న సత్తికి ఇప్పుడు చుక్కెదురైంది. ఆయన ఇటీవల చేసిన వీడియో హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని వానరసేన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బిత్తిరి సత్తి ఎలాస్పందిస్తారో వేచి చూడాలి.

publive-image publive-imagepublive-image

#bitthiri-sathi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe