MP Arvind : బీజేపీ ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు..!

నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు అయింది. ప్రచారంలో భాగంగా అర్వింద్‌ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని జగిత్యాల అర్బన్‌, రూరల్‌ మండల ఎలక్షన్‌ ఎఫ్‌ఎస్‌టీ ఇన్‌చార్జి విజయేంద్రరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీపై కేసు నమోదు చేసినట్టు జగిత్యాల టౌన్‌ సీఐ తెలిపారు.

MP Arvind : బీజేపీ ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు..!
New Update

Case Filed Against BJP MP Arvind : నిజామాబాద్‌(Nizamabad) బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌(Dharmapuri Aravind) పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు జగిత్యాల టౌన్‌ సీఐ వేణుగోపాల్‌. ఈ నెల 8న పట్టణంలో ఎన్నికల ప్రచారం(Election Campaign) లో భాగంగా ఎంపీ అర్వింద్‌ ప్రసంగిస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారన్నారు. కాంగ్రెస్‌(Congress) అభ్యర్థి జీవన్‌రెడ్డి హిందువులకు ప్రమాదకారంగా మారాడని.. జగిత్యాల పీఎఫ్‌ఐకి అడ్డాగా మారిందని..  జగిత్యాల అర్బన్‌, రూరల్‌ మండల ఎలక్షన్‌ ఎఫ్‌ఎస్‌టీ ఇన్‌చార్జి విజయేంద్రరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ వేణుగోపాల్‌ తెలిపారు.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్‌కు చేరిన ఎన్నికల ప్రచారం..

#election-campaign #nizamabad #bjp-mp-arvind
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe