Kona Venkat : ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ పై పోలీస్ కేసు!

ప్రముఖ రచయిత కోన వెంకట్ పై తాజాగా అట్రాసిటీ కేస్ నమోదయింది. బాపట్ల జిల్లాలో ఈ కేస్ నమోదవ్వడం గమనార్హం. ఓ దళిత యువకుడిపై కోన వెంకట్ చేయి చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాజేష్ అనే వ్యక్తి కేసు పెట్టాడు.

New Update
Kona Venkat : ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ పై పోలీస్ కేసు!

Case Filled On Writer Kona Venkat :  టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు రైటర్ గా పనిచేసిన ప్రముఖ రచయిత కోన వెంకట్ పై తాజాగా అట్రాసిటీ కేస్ నమోదయింది. బాపట్ల జిల్లాలో ఈ కేస్ నమోదవ్వడం గమనార్హం. ఓ దళిత యువకుడిపై కోన వెంకట్ చేయి చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాజేష్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కోన వెంకట్ పై అట్రాసిటీ కేస్

సినీ రచయిత కోన వెంకట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. బాపట్ల జిల్లా కార్లపాలేం పోలీసులు ఆయనపై కేస్ ఫైల్ చేశారు. గణపరానికి చెందిన ఎస్సీ నేత కత్తి రాజేష్ శనివారం తన అనుచరులతో కలిసి వైసీపీ కి రాజీనామా చేసి టీడీపీలోకి చేరాడు.

Also Read : ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ – రామ్ లుక్ అదుర్స్, టీజర్ ఆరోజే?

అయితే రాజేష్ తమ వద్ద రూ.8 లక్షలు అప్పు తీసుకున్నాడని వైసీపీ నేతలు పోలీసులకు పిర్యాదు చేయడంతో రాజేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకురాగా.. అక్కడే ఉన్న కోన వెంకట్ రాజేష్ పై చేయి చేసుకోవడమే కాకూండా కులం పేరుతో దూషిస్తూ.. నిన్ను చంపేస్తే అడిగే దిక్కెవడురా అంటూ అతనితో దుర్భాషలాడాడు.

దాంతో రాజేష్ వైసీపీ నుంచి టీడీపీ లోకి చేరాననే కోపంతో కోన వెంకట్, ఎస్సై తనపై దాడి చేసారని పోలీసులకు పిర్యాదు చేయగా.. అతని ఫిర్యాదుతో పోలీసులు కోన వెంకట్ తో పాటు వైసీపీ నేతలు, ఎస్సై జనార్దన్ లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Advertisment
తాజా కథనాలు