Vinesh Phogat: భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ కేసులో ఇంకా తీర్పు రాలేదు. పారిస్ ఒలింపిక్స్ 2024లో (Paris Olympics 2024) బంగారు పతకం సాధించే ముందు వినేష్ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై పరిశీలన జరపాలని వినేష్ సీఏఎస్‌కు విజ్ఞప్తి చేశారు. కానీ CAS ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కేసు విచారణ సందర్భంగా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా వినేష్‌ను సీఏఎస్ కోరింది. దీంతో బంతి మళ్ళీ ప్రస్తుతం వినేష్ కోర్టుకు చేరింది. నిజానికి ఈ అప్పీల్ లో వినేష్ రజత పతకానికి (Silver Medal) డిమాండ్ చేస్తోంది.
Vinesh Phogat: విచారణ సందర్భంగా సీఏఎస్ న్యాయమూర్తి వినేష్‌కు మూడు ప్రశ్నలు వేశారు. దీనికి ఆమె ఇమెయిల్ ద్వారా సమాధానం ఇవ్వాలి. ‘మరుసటి రోజు కూడా వెయిట్ చూడాలనే నిబంధన ఉందనే విషయం మీకు తెలుసా?’ అనేది వినేష్‌కి సీఎస్ వేసిన మొదటి ప్రశ్న. అలాగే "క్యూబన్ రెజ్లర్ మీతో రజత పతకాన్ని పంచుకుంటారా?" అని రెండో ప్రశ్న వేశారు. ఇక చివరిగా "ఈ అప్పీల్ నిర్ణయాన్ని బహిరంగ ప్రకటన ద్వారా చేయాలని కోరుకుంటున్నారా? లేక రహస్యంగా చెప్పాలని అనుకుంటున్నారా? ఏ పద్ధతిలో తీర్పు వెల్లడించాలి? అని అడిగారు. ఇప్పుడు వీటికి ఫోగట్ ఇచ్చిన సమాధానం ఆధారంగా తీర్పు ఉండబోతోందని స్పష్టం అవుతోంది.
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున వినేష్ ఫోగాట్ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు ముందు ఆమె బరువు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ కారణంగా వినేష్‌పై అనర్హత వేటు పడింది. వినేష్ బరువు తగ్గేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ ఆమెకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఈ విషయం CASలో ఉంది. సీఏఎస్ నిర్ణయం కోసం వినేష్ తో పాటు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
ఇక పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మొత్తం 6 పతకాలు సాధించింది. ఇందులో 5 కాంస్య, 1 రజత పతకాలు ఉన్నాయి. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. షూటింగ్‌లో దేశానికి మూడు పతకాలు వచ్చాయి. ఈ మూడింటికి కాంస్యం. రెజ్లింగ్‌లో కూడా పతకం వచ్చింది. అమన్ సెహ్రావత్ కాంస్యం సాధించాడు. ఇప్పుడు వినేష్ ఫోగాట్ కు పతకం వస్తే ఏడు మెడల్స్ భారత్ ఖాతాలో ఉంటాయి.
Also Read: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియా బిజీ షెడ్యూల్ ఇదే.. ఎక్కడ ఎవరితో ఆడుతుందంటే..