Gold bikini: నటి 'లో' దుస్తులకు రూ.1.46 కోట్లు.. గుండె పోటుతో క్యారీ మృతి!

హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్‌ 'స్టార్‌వార్స్‌' సినిమాలో ధరించిన బికినీ భారీ ధరకు అమ్ముడైంది. అమెరికాలోని హెరిటేజ్‌లో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.1.46 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. డిజైనర్‌ రిచర్డ్‌ మిల్లర్‌ 1998లో బంగారంతో దీనిని డిజైన్‌ చేశారు.

Gold bikini: నటి 'లో' దుస్తులకు రూ.1.46 కోట్లు.. గుండె పోటుతో క్యారీ మృతి!
New Update

Carrie Frances Fisher: ప్రముఖ హాలీవుడ్‌ నటి క్యారీ ఫిషర్‌ 'స్టార్‌వార్స్‌' సినిమాలో ధరించిన బికినీ భారీ ధర పలికింది. అమెరికాలోని హెరిటేజ్‌లో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.1.46 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ప్రఖ్యాత డిజైనర్‌ రిచర్డ్‌ మిల్లర్‌ 1998లో బంగారంతో డిజైన్‌ చేసిన ఈ లో దుస్తులు.. 1983లో విడుదలైన స్టార్‌వార్స్‌ చిత్రంలో క్యారీ ధరించినట్లు నిర్వాహకులు జో మద్దలేనా వెల్లడించారు. అయితే ఇప్పటికీ ఈ బికినీతోపాటు ఆ సినిమాకు కూడా విలువ ఏమాత్రం తగ్గలేదన్నారు.

ఇది కూడా చదవండి: Ambedkar Statue: కళ తప్పుతున్న భారీ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకం.. నో ఎంట్రీ ఎన్నాళ్లు?

లోపలి భాగం మృదువుగా తీర్చిదిద్ది..
అయితే ఈ బికినీ ధరించిన క్యారీ.. స్టార్ వార్స్ డైరెక్టర్ తనకు బంగారంతో చేసిన బికినీ గురించి చెప్పినప్పుడు జోక్ చేస్తున్నారని అనుకున్నట్లు చెప్పారు. అయితే ఆ బికినీ ధరించినప్పుడు ఇబ్బంది పడ్డానని, తన ఇబ్బందిని గుర్తించి డిజైనర్‌ లోపలి భాగాన్ని మృదువుగా తీర్చిదిద్దినట్లు క్యారీ తెలిపారు. అయితే అమెరికన్ నటి, రచయిత్రి అయిన క్యారీ ఫిషర్ 2016లో గుండె వ్యాధుల భారినపడి అనారోగ్యంతో మృతి చెందారు.

#carrie-fisher #star-wars #bikini-1-46-crores
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి