Carona in Maharashtra: మళ్ళీ కరోనా కలకలం.. మహారాష్ట్రలో కొత్తగా 19 కేసులు! మహారాష్ట్రలో కొత్తగా 19 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీంతో ఇటీవల కాలంలో మొత్తం 91 కరోనా కేసులు రికార్డు అయినట్టు తెలుస్తోంది. కొత్త కోవిడ్-19 ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ KP.2 ఇప్పుడు వ్యాప్తి చెందుతోంది. అయితే, దీని విషయంలో ఆందోళన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. By KVD Varma 13 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Carona in Maharashtra: దేశంలో మళ్ళీ కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో 19 కేసులు కనుగొన్నారు. ఇది ఓమిక్రాన్ కొత్త వేరియంట్. ఈ వేరియంట్ అమెరికాలో చాలా వేగంగా వ్యాపిస్తోందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ మొదటిసారి జనవరి 2024లో అమెరికాలో కనిపించింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఈ కొత్త వేరియంట్ వైరస్ కనపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఇప్పటివరకూ పూణేలో 51 కేసులు, థానేలో 20 కేసులు నమోదయ్యాయి. ఔరంగాబాద్, అమరావతిలో 7, షోలాపూర్‌లో 2, అహ్మద్‌నగర్, నాసిక్, లాతూర్, సాంగ్లీలో ఒక్కో కేసు నమోదయ్యాయి. Also Read: మా ప్రజల హృదయాలను బీజేపీ ఎప్పటికీ గెలుచుకోలేదు.. సీఎం కీలక వ్యాఖ్యలు! Carona in Maharashtra: కొత్త కోవిడ్-19 ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ KP.2 మొత్తం 91 కేసులను మహారాష్ట్ర రిపోర్ట్ చేసింది. ఇది గతంలో ఆధిపత్యం చెలాయించిన JN.1 వేరియంట్ కంటే శక్తివంతమైనదని, ఇప్పుడు అనేక దేశాలలో అంటువ్యాధులకు కారణమవుతుందని చెబుతున్నారు. Carona in Maharashtra: మార్చిలో, కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. దాదాపు 250 కేసులు నమోదయ్యాయి. 2019 డిసెంబర్‌లో తొలిసారిగా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. దీని తరువాత, ఇది క్రమంగా అనేక దేశాలకు వ్యాపించింది, లక్షలాది మందిని చంపింది. అప్పటి నుండి, దాని అనేక రూపాంతరాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ కేసును గుర్తించడంపై జీనోమ్ సీక్వెన్స్ టెస్టింగ్ లైజన్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ, సాధారణంగా ఏప్రిల్ - మేలో, కోవిడ్ మ్యుటేషన్‌ను పొంది కొత్త వేరియంట్‌గా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ప్రస్తుతం కేపీ.2 వైరస్ కేసు వేగంగా విస్తరిస్తోంది. కానీ ఆసుపత్రిలో చేరే రేటు తక్కువగా ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. #covid-19-updates #maharashtra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి