Hyderabad Crime: దూసుకొచ్చిన మృత్యువు...యువతి మృతి!

వనస్థలిపురంలో ఘోర ప్రమాదం జరిగింది. వనస్థలిపురం ఎన్జీఓ కాలనీలోని వివేకానంద పార్క్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో సోని అనే యువతి మృతి చెందింది.ర్యాష్ డ్రైవింగ్ తో యువతి ప్రాణాలు బలిగొన్న వ్యక్తిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

New Update
Hyderabad Crime: దూసుకొచ్చిన మృత్యువు...యువతి మృతి!

Hyderabad Crime: హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎన్జీఓ కాలనీలోని వివేకానంద పార్క్ ముందు ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్ తో ఓ కారు పాదచారుల పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందింది. మితిమీరిన వేగంతో కారు దూసుకురావడంతో హయత్ నగర్ కి చెందిన సోని (21) అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సోని మృతి చెందింది. ర్యాష్ డ్రైవింగ్ తో యువతి ప్రాణాలు బలిగొన్న వ్యక్తిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

Also Read: తెగిపోయిన రైల్వేలైన్.. తెలంగాణ, ఏపీ మధ్య ఆ రైళ్లన్నీ రద్దు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు