AP News : ఏపీ (Andhra Pradesh) లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సరదాగా పాలకోవ తీనేందుకు వెళ్లిన యువకులు కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిధిలోని చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
పాలకోవా తినేందుకు కారులో వెళ్లి..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా కడప (YSR Kadapa District) కు చెందిన పూజారి ఆంజనేయులు నాయక్, పఠాన్ అఫ్రోజ్ అలీఖాన్, ఎం.జితేంద్రకుమార్, షేక్ అలీం, షేక్ ఖాదర్‌బాషా(19) స్నేహితులు. వీరంతా కలిసి అర్ధరాత్రి 1.30 గంటలకు కడప నుంచి రామాపురం మండలంలోని గువ్వలచెరువులో పాలకోవా తినేందుకు కారులో వెళ్లారు. అయితే అక్కడ పాలకోవా తిని కాసేపు సరదాగా గడిపిన యుకులు.. శనివారం తెల్లవారుజామున రామాపురం జాతీయరహదారి మీదుగా కడపకు బయలుదేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు కొండవాండ్లపల్లి సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ట్యాంకరును బలంగా ఢీకొట్టింది. దీంతో ఆంజనేయులు నాయక్(28), పఠాన్ అఫ్రోజ్ అలీఖాన్ (26), జితేంద్రకుమార్(24), షేక్ అలీం(35) అక్కడికక్కడే చనిపోయారు.
అయితే స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి వెళ్లి తీవ్రంగా గాయపడిన ఖాదర్‌బాషాను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని లక్కిరెడ్డిపల్లె సీఐ జీవన గంగనాథబాబు తెలిపారు. ప్రమాదస్థలాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి బాధిత కుటుంబాలకు రూ.లక్ష రూపాయలు తక్షణ సాయం అందించారు.
Also Read : హైదరాబాద్‌లో చంద్రబాబు భారీ ర్యాలీ