Tirumala : తిరుమలలో ఘోర ప్రమాదం.. కారు టైర్‌ పగిలి..నలుగురి పరిస్థితి విషమం!

తిరుమలలో ఘోర ప్రమాదం జరిగింది. స్వామి వారి దర్శనానికి వస్తున్న తమిళనాడు భక్తులు ఈ ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డారు. కారు టైరు పగిలి..కరెంట్‌ స్తంభానికి ఢీకొనడంతో నలుగురు భక్తుల పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Road Accident : తిరుమల (Tirumala) లో ఘోర ప్రమాదం జరిగింది. స్వామి వారి దర్శనానికి వస్తున్న తమిళనాడు (Tamilnadu) భక్తులు ఈ ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డారు. కారు టైరు పగిలి.. కరెంట్‌ స్తంభానికి ఢీకొనడంతో నలుగురు భక్తుల పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం తిరుపూర్‌ జిల్లా, ఉడుమాల్‌ పెటై, గణపతి పాల్యంలో ఒకే కుటుంబానికి చెందిన కరుణాకరన్, లావణ్య, సదాశివన్ ,నందిని అనే నలుగురు కారులో తిరుమలకు వెళ్తున్నారు.

వారు పూతలపట్టు మీదుగా గురువారం రాత్రి 7 గంటల సమయంలో తిరుమల పాల డైరీ (Tirumala Milk Dairy) వద్ద ఒక్కసారిగా టైరు పేలి కారు అదుపుతప్పి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొరణంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య సేవలు నిమిత్తం వేలూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read: పవన్‌ స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Advertisment
తాజా కథనాలు