Big Breaking: ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు.. సీఎం జగన్ సంచలన నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. విజయదశమి తరువాత విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

Andhra Pradesh: అభ్యర్థుల ఖరారుపై జగన్‌ ఫోకస్‌..నేరుగా నేతలతోనే చర్చలు..
New Update

AP Capital Shift to Vizag: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM YS Jagan) సంచలన ప్రకటన చేశారు. విజయదశమి(Dasara) తరువాత విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. విజయదశమి తరువాత విశాఖ నుంచే పాలన చేస్తామని స్పష్టం చేశారు. దసరా నాటికి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఉంటుందన్నారు. మొదటిగా సీఎంఓ తరలింపు, ఆ తరువాత ప్రభుత్వ శాఖల తరలింపు ఉంటుందని తెలిపారు సీఎం.

ప్రభుత్వ ఉద్యోగులపై కేబినెట్ వరాల జల్లు..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగి విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా నిర్ణయం తీసుకుంది. అంటే.. ఉద్యోగి రిటైర్ అయిన సమయానికి సొంత ఇంటి స్థలం లేకపోతే.. అలాంటి వారికి ఖచ్చితంగా ఇంటిస్థలాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. ఇది ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు సీఎం జగన్. రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే రిటైర్డ్ ఉద్యోగులు, వారి పిల్లలకు కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జమిలి ఎన్నికలపై కీలక ప్రకటన..

జమిలి ఎన్నికలపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. జమలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు సీఎం జగన్. ఏ ఎన్నికలకైనా సిద్ధంగా ఉండాలంటూ మంత్రులకు స్పష్టం చేశారు సీఎం.

ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు కేబినెట్‌ ఆమోదం..

ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్‌ ఉండేలా చట్ట సవరణ చేశారు. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వనున్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మార్పుల వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రపంచంలోని టాప్‌ 100 యూనివర్శిటీలతో టై అప్‌ ఉండేలా చట్ట సవరణ చేశారు. దీనివల్ల జాయింట్‌ సర్టిఫికేషన్‌ లభిస్తుందన్నారు. ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలోకి వస్తాయని, దీనివల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు సీఎం జగన్.

Also Read:

Chandrababu Arrest🔴 LIVE UPDATES: మరో కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు..

Parliament special session 🔴 LIVE: లోక్ సభ లో మహిళా రిజర్వేషన్ పై చర్చ

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe