పోటీ చేసేందుకు ఎగబడుతున్న అభ్యర్థులు.. ఎక్కడంటే.?

ఉమ్మడి నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ నేతలు పోటీ చేసేందుకు ఎగబడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పోటీ చేసేందుకు ఎగబడుతున్న అభ్యర్థులు.. ఎక్కడంటే.?
New Update

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీలో నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎగబడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్‌ నియోజకవర్గానికి 8 మంది దరఖాస్తు చేసుకోగా.. నిజామాబాద్‌ రూరల్‌ నుంచి ఆరుగురు, బాల్కొండ నుంచి నలుగురు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో అత్యధికంగా బాన్సువాడ, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు 12 మంది దరఖాస్తు చేసుకున్నారు.

కాంగ్రెస్ అభ్యర్ధుల కోసం ధరఖాస్తు గుడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో ఏ స్థానానికి ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది వెల్లడించింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న వారిలో ఎస్సీ, ఎస్టీలు 25 వేల రూపాయలు చెల్లించగా.. బీసీ, ఓసీలు 50 వేల రూపాయలను దరఖాస్తు రుసుముగా చెల్లించారు. మరోవైపు దరఖాస్తు పక్రియ ముగిసినా ఈ నెల 25లోపు డీడీ తీసుకున్న అభ్యర్థులు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గంలోని ప్రతీ రెండు స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పిస్తున్నట్లు పీసీసీ తెలిపింది.

దీంతో పార్టీలో ఉన్న బీసీ నేతలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కాగా పీసీసీ వారిలో ఎవరిని ఎంపీక చేస్తుంది, అధిష్టానానికి పంపనున్న లిస్ట్‌లో ఎవరి పేరు ఉంటుందనే అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ టికెట్‌ వస్తుందని ఆశించిన నేతలకు పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటనేది కాంగ్రెస్ పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు బలంగా ఉన్నాడు.. ఎవరికి సీటిస్తే పార్టీని గెలిపిస్తారు ఆనే దానిపై పీసీసీ ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం

#nizamabad #candidates #congress #competition
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe