TSPSC: గ్రూప్ 4 నియామకాల్లో కీలక మార్పులు!

తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో విధించిన రోస్టర్ విధానాన్ని టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఏ జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయనే పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు.

New Update
TSPSC: గ్రూప్ 4 నియామకాల్లో కీలక మార్పులు!

Group 4: తెలంగాణలో గ్రూప్ 4 నియామకాలకు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో విధించిన రోస్టర్ విధానాన్ని రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రోస్టర్ విధానం, మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాలను అధికారిక వెబ్‌సైటులో అప్ లోడ్ చేసింది. రోస్టర్ ఉపసంహరణతో ఏ జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయనే పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు.

గ్రూప్-1‌తో మొదలైన హారిజాంటల్ రోస్టర్..
ఇక గ్రూప్ 4 పరీక్ష 2023 జూలైలో నిర్వహించగా.. ఇటీవలే పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అయితే రాష్ట్రంలో గ్రూప్-1‌తో మొదలైన హారిజాంటల్ రోస్టర్ విధానంతో ఎక్కువ పోస్టులు మహిళలకే రిజర్వు అవుతుండగా, పురుష అభ్యర్థులు కోర్టు‌లో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు విచారణ జరిపి ఉద్యోగాల భర్తీలో సమాంతర రోస్టర్ విధానం అమలు చేయాలని, వర్టికల్ విధానం చెల్లదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Viral Video: నా మీద జోకులు వేస్తావా? బాలికను నడిరోడ్డుపై కత్తితో పదేపదే పొడిచిన దుర్మార్గుడు!

ప్రతి ఓపెన్‌లో 33% రిజర్వేషన్‌..
ఈ వర్టికల్‌ రోస్టర్ విధానం ప్రకారం మహిళ అభ్యర్థులకు ప్రతి ఓపెన్‌లో 33% రిజర్వేషన్‌తో పాటు మహిళా కేటగిరీలో మళ్ళీ ప్రత్యేకంగా కోటా కేటాయించారు. దీనివల్ల మహిళ అభ్యర్థులకు ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌లో 60% వరకు ఉద్యోగాలు దక్కుతాయి. కానీ హారిజాంటల్ విధానంలో ప్రతి జనరల్ కేటగిరీలో మహిళా అభ్యర్ధులకు 33% తప్పని సరిగా ఉండేలా రోస్టర్ సూచిస్తోంది. ఈ విధానంలో ప్రతి నోటిఫికేషన్‌లో పురుష, మహిళా అభ్యర్ధులకు సమాన అవకాశాలు లభిస్తాయి. మెరిట్‌లో ఉన్నవారే ఉద్యోగానికి అర్హులు.

Advertisment
తాజా కథనాలు