అన్ని మీరే ఊహించుకుంటారా: సోము వీర్రాజు

టీడీపీ పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాను చంద్రబాబు కలిసినంత మాత్రాన ఒరిగేదేమి లేదన్నారు. త్వరలో ఏపీలో డబ్బింగ్ స్టూడియో పోయి.. కమలం వికసిస్తోందన్నారు. అంతేకానీ మీరు ఊహించినట్లుగా ఏం జరగదని సోము స్పష్టం చేశారు.

New Update
అన్ని మీరే ఊహించుకుంటారా: సోము వీర్రాజు

Can you all imagine Somu Veeraraju

చేసిన అభివృద్ధి ఏంటీ..?

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని వెరు చెప్పారని వీర్రాజు ప్రశ్నించారు. అమిత్ షాను చంద్రబాబు కలిసినంత మాత్రాన అన్నీ ఊహించుకుంటారా అని ఆయన నిలదీశారు. అమిత్ షాతో భేటీ తర్వాత దానిపై చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదని.. కానీ వారిద్దరి మధ్య భేటీని ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు ఊహించుకుంటున్నారని సోము వీర్రాజు దుయ్యబట్టారు. రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనేది తన ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు.

కులపరమైన గొడవ

వైసీపీతో తాము ఎప్పుడూ లేమని.. జగన్ ప్రభుత్వ అవినీతిపై పోరాడుతున్నామని సోము వీర్రాజు వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు తాము చేపట్టిన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిణామాలు మారాయని , రాబోయే రోజుల్లో మరింత మారుతాయని సోము వీర్రాజు పేర్కొన్నారు. పవన్ - ముద్రగడ గొడవను కులపరమైన గొడవగా తాము భావించడం లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

డబ్బింగ్ స్టూడియో

ఇంత జరిగిన తర్వాత చంద్రబాబు, అచ్చెన్నాయుడు మాటలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే నేను మాట్లాడాను అన్నారు. నా మాటలను విమర్శలుగానో.. వ్యతిరేకంగానో చూడొద్దన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లే ఏపీకి నష్టం వాటిల్లుతోందని, అసలు ఇలాంటి మాటలు అవసరమా అన్నారు. ఇలాంటి కామెంట్ల వల్లే ఏపీలో ఇలాంటి ప్రభుత్వం వచ్చిందన్నారు. మోడీ తొమ్మిదేళ్ల పాలనపై బహిరంగ సభలు జరుగుతున్నాయన్నారు. ఏపీలో గాలి మారుతోంది.. కమలం వికసిస్తోంది, నిజాలను గుప్పెట్లో పెట్టి ఎంతో కాలం ఆపలేరన్నారు సోయువీరాజు. జగన్ ప్రభుత్వం వేస్తోన్న స్టిక్కర్లు ఎంతో కాలం నిలవవు.. ఏపీలోని గత-ప్రస్తుత ప్రభుత్వాలు కేంద్ర నిధులను దుర్వినియోగం చేశాయని మండిపడ్డారు.ఏపీలో జగన్ ప్రభుత్వం డబ్బింగ్ ప్రభుత్వంగా మారిందని ఆయన వ్యాఖ్యనించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు